బంగారు త‌ల్లీ..హిమ‌దాస్ ..నీకో స‌లాం..!

ఈ దేశం నిన్ను ఎప్ప‌టికీ మ‌రిచి పోదు..త‌ల్లీ హిమ‌వ‌ర్షిణి..నీ ప్ర‌య‌త్నం గొప్ప‌ది. నీ త్యాగం నిరుప‌మానం. నీ ప‌ట్టుద‌ల ముందు ఆట ఓడిపోయింది. క‌ష్టాలు వ‌చ్చినా..క‌న్నీళ్లు దిగ‌మింగుకుని బంగారు ప‌తాకాన్ని ముద్దాడ‌డం నీకు మాత్ర‌మే చేత‌న‌వును..హిమ‌దాస్. నిన్ను చూసిన‌ప్పుడ‌ల్లా అభివృద్ధికి దూరంగా ఉన్న ప‌ల్లెలు గుర్తుకు వ‌స్తున్నాయి. చిరుత పులుల గురించి సినిమాల్లో, డిస్క‌వ‌రీ ఛాన‌ల్స్‌లో చూడ‌ట‌మే త‌ప్పా..నిజ జీవితంలో నువ్వు నిజ‌మైన చిరుతవి హిమ‌. వ‌య‌సు రీత్యా 19 ఏళ్ల‌యినా ఇంకా ఎంతో భ‌విష్య‌త్ ఉన్న‌ప్ప‌టికీ ..నీ అడుగులు త‌ప్ప‌లేదు. నీ ల‌క్ష్యం గురి ప‌క్క‌కు వెళ్ల‌లేదు. నీ చూపు..నీ ధ్యాసంతా ఆట మీద‌నే. క‌ష్టాన్ని న‌మ్ముకుంటే..ప‌ట్టుద‌ల‌తో ఉంటే దేనినైనా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించిన నీకు వేలాది వంద‌నాలు త‌ల్లీ. నువ్వు ఇలాగే ఆడాల‌. 

ఇదే క‌సితో నువ్వు మైదానంలోకి అడుగు పెట్టాల. ఒక‌టా రెండా ఎంతో పోటీని త‌ట్టుకుని అయిదు బంగారు ప‌త‌కాలు తీసుకున్న నీకు అభినంద‌న‌లు. నీవు సాధించిన ఈ విజ‌యాలు..ఈ ప‌త‌కాలు ..నీకు మాత్ర‌మే కాదు..నిన్ను క‌న్న‌వారికి..నిన్ను పంపించిన ఊరికి..వంద కోట్ల‌కు పైగా ఉన్న జ‌నానికి నువ్వు ఆద‌ర్శంగా నిలిచావు. గ‌ర్వ‌కార‌ణ‌మై ఉండి పోయావు. ఇండియ‌న్ స్టార్‌గా మ‌రోసారి నిన్ను నీవు నిరూపించుకున్నావు. ప్ర‌పంచ క‌ప్ మాయ‌లో ప‌డిన ఈ బుద్దిలేని జ‌నానికి నువ్వు ఓ పాఠంగా మిగిలి పోతావు. పీటి ఉష‌, అశ్వ‌నీ నాచ‌ప్ప , మేరీ కోమ్ లాంటి వాళ్ల స‌ర‌స‌న నువ్వు కూడా చేరావు. త‌ల్లీ నువ్వు ఇలాగే ఉండాలి. స్టార్ స్ప్రింట‌ర్‌గా ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్న నీవు 20 రోజుల వ్య‌వ‌ధిలో ఐదో స్వ‌ర్ణం తీసుకోవ‌డం ఓ రికార్డు. తాజాగా నోవ్ మెస్టోనాడ్ మెటుజీ గ్రాండ్ ప్రిక్స్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టి చేజిక్కించుకుంది. 

కేవ‌లం 52.09 సెకండ్ల‌లోనే 400 మీట‌ర్ల రేసును పూర్తి చేసింది. 2018 ఏషియ‌న్ గేమ్స్ లో త‌న బెస్ట్ ర‌న్ టైమ్ 50.79 రికార్డును ఆమె తిర‌గ రాసింది. బంగారు ప‌త‌కాన్ని గెలుచుకుంది. హిమ‌దాస్‌కు తెలిసింద‌ల్లా క‌ష్ట‌ప‌డ‌ట‌మే. ఉద‌యం నుంచి ప‌డుకునే దాకా ప‌రుగులు తీయ‌డ‌మే. మొన్న జ‌రిగిన 200 మీట‌ర్ల రేసును ఆమె 23.25 సెక‌న్ల‌లో ముగించి గోల్డ్ మెడ‌ల్ సాధించింది. వీకే విస్మ‌య 23.43 సెక‌న్ల టైమింగ్‌తో ర‌జ‌తం గెల్చుకుంది. మిగ‌తా బంగారు ప‌త‌కాల‌ను ఈనెల 2న జ‌రిగిన పొజ‌న్ అథ్లెటిక్ గ్రాండ్ ప్రీ పోటీలో 200 మీట‌ర్ల రేస్‌ను 23.65 సెక‌న్ల‌తో పూర్తి చేసి తొలి గోల్డ్ సాధించింది. 7న కుంటో అథ్లెటిక్ మీట్‌లో 23.97 సెక‌న్ల టైమింగ్‌తో రెండో ప‌త‌కాన్ని గెల్చుకుంది. 13న క్లాడ్నో అథ్లెటిక్ మీట్‌లో 23.43 సెక‌న్ల రేస్ పూర్తి చేసి మూడో బంగారు ప‌త‌కాన్ని ఒడిసి ప‌ట్టుకుంది. రాబోయే రోజుల్లో హిమ‌దాస్ ప‌రుగులు తీస్తూనే మ‌రిన్ని బంగారు ప‌త‌కాలు తీసుకు రావాల‌ని, దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిల‌వాల‌ని కోరుకుందాం. 

కామెంట్‌లు