వెంకటేశ్వురుడి ఆశీస్సులే ఇస్రోకు శ్రీరామ రక్ష
శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించినా..నమ్మకాల విషయంలో ఇంకా మనం ప్రారంభంలోనే ఉన్నామనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కు బాధ్యతలు నిర్వహిస్తున్న , పేరొందిన, అనుభవం కలిగిన శాస్త్రవేత్తలు ప్రతిభలో గొప్పవారుగా పరిగణించినప్పటికీ మూఢ నమ్మకాల విషయంలో తాము ఇంకా అధమ స్థానంలోనే ఉన్నామని తమను తాము నిరూపించుకుంటున్నారు. ప్రతిసారి ఇస్రో ప్రయోగించే కొత్త రాకెట్‌లు, ఉపగ్రహాల లాంఛింగ్ చేసేకంటే ముందు, ప్రతిసారి తిరుమలలో కొలువై వున్న శ్రీ వేంకటేశ్వరుడు, పద్మావతి అమ్మవారిని దర్శించు కోవడం కొన్ని దశాబ్దాలుగా వస్తూనే ఉన్నది. ముహూర్తం నిర్ణయించేందుకు స్వామీజీల సలహాలు, సూచనలను తీసుకుంటోంది. శాస్త్ర , సాంకేతిక పరంగా ప్రపంచం మనకంటే ముందుకు దూసుకెళుతోంది.
ఓ వైపు ఉత్తర కొరియా, అమెరికా, చైనా, జపాన్, రష్యా, ఫ్రాన్స్, ఇరాన్ , తదితర దేశాలన్నీ తమ ఆయుధ, సాంకేతిక, శాస్త్ర సంపత్తిని పెంచుకుంటూ వెళుతున్నాయి. టాప్ పొజిషన్‌లో ఉంటున్నాయి. చంద్రయాన్ -2 పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న ఇస్రో లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేసింది. దీనిని తయారు చేసేందుకు భారీ ఎత్తున ఖర్చు చేసింది. దేశ వ్యాప్తంగా హడావుడి చేసింది. దాదాపు 1000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేసి ధనమంతా బుగ్గి పాలై పోయింది. బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపించింది ఇందులో. భారత రాష్ట్రపతి, దేశ ప్రధాని, హోం శాఖ , రక్షణ శాఖలతో పాటు కోట్లాది భారతీయులు చంద్రయాన్ -2 సక్సెస్ అవుతుందని భావించారు. ఆ గోవిందుడికి మొక్కుకున్నారు. సైంటిస్టుల ఆశలు ఫలించలేదు..ఇండియన్స్ కల నెరవేరలేదు. స్వాముల ఆశీస్సులు ఫలించలేదు. సైంటిస్టులు మనుషులే కాదనలేం. కానీ ఎవరి నమ్మకాలు వారివి. వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి భంగం వాటిల్లేలా చేయడం భారత రాజ్యంగం ఒప్పుకోదు.
వ్యక్తి స్వేచ్ఛకు ప్రయారిటీ ఇస్తుంది. కానీ తమ నమ్మకాలను ఇలాంటి బిగ్ ప్రాజెక్టులకు ఆపాదించడం వల్ల నష్టాలే తప్పా ఫలితాలు అంత ఆశాజనకంగా వుండవు. తాజాగా చంద్రయాన్ -2 లాంఛింగ్ కంటే ముందు ..ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ కె.శివన్ ఏకంగా కర్నాటకలోని ఉడిపి కృష్ణ మఠంకు వెళ్లారు. అక్కడ ఉన్న పీఠాధిపతిని కలిసి ..ఆశీస్సులు తీసుకున్నారు. దీనిపై సామాజికవేత్తలు, ప్రజా సంఘాలు, నాస్తికవాదులు, కమ్యూనిస్టులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వ్యక్తిగతంగా వెళ్లితే తాము ఏమీ అభ్యంతరం పెట్టమని..కానీ దేశ భవిష్యత్‌కు సంబంధించిన ఇస్రో సంస్థకు అధిపతిగా ఉంటూ..భారీ ప్రాజెక్టులను లాంఛింగ్ చేస్తున్న ఈ సమయంలో పీఠాధిపతులను కలవడాన్ని మేం ఎంత మాత్రం ఒప్పుకోమంటూ ధ్వజమెత్తారు. దీనిని లైట్ తీసుకున్నారు ఇస్రో ఛైర్మన్ శివన్. 15న లాంఛ్ చేస్తామని ప్రకటించిన ఇస్రో..పైకి ఎగరకుండానే ఉన్న చోటనే ఉండి పోయింది. మళ్లీ చంద్రుడి వద్దకు పంపించేందుకు ప్లాన్ చేశారు. ఈసారైనా స్వామి వారి ఆశీస్సులతో సక్సెస్ కావాలని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి