ఫ్లిప్‌కార్ట్ మార్కెటింగ్ హెడ్‌గా వికాస్ గుప్తా
ఇండియాలో అటు ఆన్‌లైన్..ఇటు ఆఫ్‌లైన్‌లో ఈకామర్స్ రంగంలో తనకంటూ ఓ బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్న భారతీయ కంపెనీ ఫ్లిప్ కార్ట్ వికాస్ గుప్తాను మార్కెటింగ్ హెడ్‌గా నియమించింది. భారీ ఎత్తున అతడికి ఆఫర్ చేసినట్టు సమాచారం. ఓ వైపు అమెరికా దిగ్గజ కంపెనీ అమెజాన్‌కు ఫ్లిప్ కార్ట్ నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో భారీ డిస్కౌంట్లతో ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది అమెజాన్. అయినా పక్కా లోకల్, దేశీయ బ్రాండ్ పేరుతో ఫ్లిప్ కార్ట్ రోజు రోజుకు తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటూ వెళుతోంది. దీంతో ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఫ్లిప్ కార్ట్‌ను మరో అమెరికన్ కంపెనీ వాల్ మార్ట్ బంపర్ ఆఫర్ ఇవ్వడమే కాక భారీగా డీల్ కుదుర్చుకుంది. దీంతో అతి పెద్ద ఈకామర్స్ సంస్థగా ఏసియన్ మార్కెట్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది.
లాజిస్టిక్ రంగంలో పెను మార్ప్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ మరింత అభివృద్ధి చెందడంతో ఈ కామర్స్ బిజినెస్ కొత్త హంగులు దిద్దుకుంటూ మార్కెట్ వర్గాలకు అందనంత దూరంలోకి వెళుతున్నాయి. ఈ సమయంలో పోటీని తట్టుకుని , వ్యాపారాన్ని ఆదాయం వైపు మళ్లించేందుకు ఫ్లిప్ కార్ట్ అనుభవం కలిగిన వ్యక్తులు, నిపుణులను ఎంపిక చేసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రఖ్యాత కంపెనీ అయిన యునిలివర్ ఇండోనేషియా కంపెనీకి జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వికాస్ గుప్తాను ఫ్లిప్ కార్ట్ తన మార్కెటింగ్ విభాగం మొత్తానికి హెడ్ గా నియమించింది. యునిలివర్ కంపెనీలో మార్కెటింగ్, లాజిస్టిక్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, హోమ్ కేర్ డివిజన్‌ను చూసుకున్నారు గుప్తా. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో పోటీ పడ్డారు. ఏరికోరి వికాస్ గుప్తాను ఎంచుకున్నదంటే వికాస్‌కు ఉన్న సామర్థ్యం ఏపాటిదో ఇప్పటికే అర్థమై వుంటుంది.
మార్కెటింగ్, లాజిస్టిక్ రంగాలతో పాటు డిజిటిల్ ట్రాన్స్‌ఫార్మేషన్ విభాగాలు లేకుండా ఈ కామర్స్ వ్యాపారం బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. ఎంతో మంది మేం ఇచ్చిన పిలుపునకు స్పందించారు, వారందరికి అభినందనలు. ప్రపంచ మార్కెట్‌ను అర్థం చేసుకుని, మా కంపెనీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు, ఇతర కంపెనీల నుండి పోటీ తట్టుకుని నిలబడేలా చేసే దిగ్గజ నిపుణులు కావాలి. ఇపుడంతా పోటీనే..ఇదంతా ఆరోగ్యకరమైన వాతావరణంలోనే కొనసాగుతోంది. ఎవరి ప్రయత్నాలలో వారున్నారు. దానిని కాదనలేం. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాల్సి ఉంటుంది..లేకపోతే మేం వెనక్కి వెళ్లిపోతాం.
ఇతర ఈకామర్స్ రంగంలో ఉన్న కంపెనీలు మాలాగే ఆలోచిస్తాయని తెలుసు. కానీ ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ని సకాలంలో తీసుకుంటారో, భిన్నంగా అమలు చేస్తారో సదరు కంపెనీలే నిలుస్తాయని స్పష్టం చేశారు..ఫ్లిప్ కార్ట్ గ్రూప్ కంపెనీ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్. మేం కోరుకున్న ..మాకు కావాల్సినవన్నీ వికాస్ గుప్తాలో ఉన్నాయి. అందుకే అతడిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. దాదాపు యునిలివర్ కంపెనీకి 20 ఏళ్ల పాటు సేవలందించారు. దానిని గొప్ప కంపెనీగా తీర్చిదిద్దడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. అదే స్ఫూర్తిని మాతో కొనసాగిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు..ఆయన నమ్మకాన్ని గుప్తా నిలబెట్టుకుంటారని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి