పేమెంట్స్ రంగంలోకి ఆదిత్య గ్రూప్ - ఆర్బీఐ లైన్ క్లియర్
డిజిటల్ టెక్నాలజీ పుణ్యమా అంటూ ఇండియాలో పెద్ద ఎత్తున బ్యాంకింగ్ రంగ వ్యవస్థ ఎదుర్కొంటున్న కష్టాలు తొలగి పోతున్నాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహిస్తూ..ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇంకో వైపు నోట్ల రద్దు దెబ్బకు భారతీయ ఆర్థిక వ్యవస్థ కునారిల్లి పోయింది. జీఎస్టీ అమలు చేయడంతో కేంద్రానికి గణనీయంగా ఆదాయం సమకూరింది. దీంతో బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అన్ని లావాదేవీలతో పాటు రుణాలు, ఇతర ఆర్థిక పరమైన కార్యక్రమాలన్నీఇపుడు మరింత సులభతరం అయ్యాయి. అన్ని బ్యాంకులు టెక్నాలజీతో అనుసంధానం కావడంతో సేవలు వేగవంతం అవుతున్నాయి. సంబంధిత బ్యాంకులకు చెందిన యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటే చాలు క్షణాల్లో ఎన్ని డబ్బులైనా..ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా పంపించు కోవచ్చు.
కోటక్ మహీంద్ర, టాటా గ్రూప్ , రిలయన్స్ కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. తాజాగా ఈ కామర్స్, లాజిస్టిక్ రంగంలో టాప్ రేంజ్‌లో ఉన్న ఆదిత్య , బిర్లా గ్రూప్ కంపెనీ పంట పండింది. పే మెంట్స్ బ్యాంక్ లను ప్రారంభించేందుకు లైసెన్స్ మంజూరు చేసింది. దీంతో ఉన్న అడ్డంకులన్నీ తొలగి పోయాయి. ఐడియా టెలికాం కంపెనీని ఇటీవలే టేకోవర్ చేసింది. ఆదిత్యా బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఛైర్మన్‌గా ఉన్నారు కుమార్ మంగళం బిర్లా. ఆదిత్య బిర్లా నువో తో పాటు ఐడియా కంపెనీలు జాయింట్ వెంచర్ కలిగి ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించి 51 , 49 శాతంగా ఉన్నాయి. మంగళవారం తమ కంపెనీకి లైసెన్స్ మంజూరు చేస్తున్నట్లు ఆర్బీఐ సమాచారం పంపించందని ఛైర్మన్ బిర్లా వెల్లడించారు.
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగానికి ధీటుగా ..దేశ వ్యాప్తంగా వినియోగదారులకు విశిష్టమైన సేవలందించేందుకు తాము రెడీగా ఉన్నామని, ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నామని ఆదిత్య వెల్లడించారు. ఐడియా సెల్యూలార్ పేరుతో ఆదిత్యా బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌గా బ్యాంకులను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి నగరంలో దీనిని ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రస్తుతం టెలికాం రంగంలో ఉన్న ఎయిర్‌టెల్ కంపెనీతో పాటు తాజాగా దేశ వ్యాప్తంగా అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన భారతీయ పోస్టల్ శాఖ ..పోస్ట్ బ్యాంకులను ప్రారంభించింది. టెక్ మహీంద్రా కంపెనీ కోటక్ మహీంద్ర బ్యాంక్‌ను స్టార్ట్ చేసింది.ఐడీఎఫ్‌సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో బ్యాంక్ ఏర్పాటుకు లైసెన్స్ కూడా పొందింది. పేమెంట్స్ బ్యాంక్‌లు లక్ష రూపాయలను డిపాజిట్‌లుగా వ్యక్తుల నుంచి స్వీకరిస్తోంది. మొత్తం మీద బ్యాంకింగ్ రంగం ఇండియాలో కొత్త పుంతలు తొక్కుతోందన్నది వాస్తవం. .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి