క‌న్న‌డ స‌ర్కార్ ఉండేనా..ఊడేనా..మిగిలేది రాష్ట్ర‌ప‌తి పాల‌నేనా..!

క‌న్న‌డ నాట రాజ‌కీయం చ‌ద‌రంగాన్ని ..వైకుంఠపాళి ఆట‌ను త‌ల‌పింప చేస్తోంది. అంతుచిక్క‌ని ట్విస్టుల‌తో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ కూట‌మి..బీజేపీలు ర‌క్తి కట్టించేలా చేస్తున్నాయి. క‌ర్నాట‌క‌లో సంక్షోభ ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ది. ఇవాళ రేపు అంటూ దాట‌వేత ధోర‌ణిని అవ‌లంభిస్తూ..వాయిదా వేస్తూ వ‌స్తున్న స్పీక‌ర్ పై గ‌వ‌ర్న‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, తిరిగి సీఎంకు లేఖ కూడా రాయ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. తాము రాజ్యాంగ‌బ‌ద్దంగా ఎన్నిక‌య్యామ‌ని, ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డ‌మే బీజేపీ ప‌నిగా పెట్టుకుందంటూ విధాన‌స‌భ‌లో సీఎం కుమార స్వామి తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రో వైపు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గుండురావుతో పాటు ముఖ్య‌మంత్రి కుమార సుప్రీంకోర్టులో గ‌వ‌ర్న‌ర్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ పిల్ వేశారు. తాము సంకీర్ణ స‌ర్కార్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు రాజీనామాలు స్పీక‌ర్ ర‌మేష్ కుమార్‌కు స‌మ‌ర్పించారు. అవి స్పీక‌ర్ ఫార్మాట్‌లో లేవంటూ తిప్పి పంపించారు. దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

విచార‌ణ‌కు స్వీక‌రించిన ధ‌ర్మాస‌నం స్పీక‌ర్ పున‌రాలోచించాల‌ని, త‌క్ష‌ణ‌మే అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాలంటూ ఆదేశించింది. గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల‌ను ర‌మేష్ కుమార్ ధిక్క‌రించారు. తాను రాజ్యాంగ‌బద్దంగానే న‌డుచుకుంటున్నాన‌ని, త‌న‌పై ఆజ‌మాయిషీ చెలాయించే అధికారం లేదంటూ స్ప‌ష్టం చేశారు. స్పీక‌ర్ ప‌క్ష‌పాతం వ‌హిస్తున్నారంటూ రెబ‌ల్ ఎమ్మెల్యేల త‌ర‌పున న్యాయ‌వాది కోర్టు ముందు వాదించారు. దీనిపై ధ‌ర్మాస‌నం స‌భాప‌తిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వెంట‌నే అవిశ్వాస తీర్మానం చేప‌ట్టాలంటూ బీజేపీ అధ్యక్షుడు య‌డ్యూర‌ప్ప గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి విన్న‌వించారు. త‌న మాట బేఖాత‌రు చేయ‌డంపై గ‌వ‌ర్న‌ర్ మండిప‌డ్డారు. మ‌ళ్లీ అవిశ్వాస ప‌రీక్ష‌కు గ‌డువు విధించారు. ఆ స‌మ‌యం పూర్తి కావ‌డంతో క‌న్న‌డలో ఎవ‌రు ప‌వ‌ర్‌లోకి వ‌స్తారో తెలియ‌క ఉత్కంఠ నెల‌కొంది. కాంగ్రెస్, జేడీఎస్‌లు తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా లేక క‌మ‌ల‌నాథులు అధికారాన్ని చేజిక్కించుకుంటారా ..కాక పోతే గ‌వ‌ర్న‌ర్ పాల‌నే శ‌ర‌ణ్య‌మా అనేది తేట‌తెల్లం కానున్న‌ది. తిన‌బోతూ రుచులు ఎందుకంటూ అన్న చందంగా క‌ర్నాటక పాలిటిక్స్ రంజుగా మారాయి.

ఓ వైపు కుమార స్వామి మ‌రో వైపు సిద్ధిరామ‌య్య‌, ఇంకో వైపు యెడ్డీలు  ఎవ‌రికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ..మ‌రింత హీట్ పెంచుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ఎలాగైనా స‌రే పావులు క‌దుపుతూ..ప‌వ‌ర్‌లోకి రావాల‌ని ప్లాన్ వేసింది. బ‌ల నిరూప‌ణలో ఎవ‌రు బ‌ల‌వంతులో తేల‌నుంది. విధాన‌స‌భ‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క రాష్ట్ర ప్ర‌జ‌లు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కీల‌కం కానున్నాయి. నిన్న‌టి దాకా బీఎస్పీ ఎమ్మెల్యే మ‌ద్ధ‌తు ఉప‌సంహ‌రించు కుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో టెన్ష‌న్ నెల‌కొన‌గా ..మాయావ‌తి జోక్యం చేసుకుని కుమార స్వామికి మ‌ద్ధ‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఈ స‌మ‌యంలో బీజేపీపై సీఎం కుమార స్వామి నిప్పులు చెరిగారు. పైకి నీతులు మాట్లాడే క‌మ‌ల‌నాథులు ..ప‌క్క పార్టీ ఎమ్మెల్యేల‌ను ప్రలోభాల‌కు గురి చేసి..అడ్డ‌గోలుగా కొనేసి రాజ్యాంగాన్ని జోక్‌లాగా మార్చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. గ‌వ‌ర్న‌ర్ ఎన్ని డెడ్‌లైన్లు విధించినా, బ‌ల‌ప‌రీక్ష‌పై స‌మ‌గ్ర చ‌ర్చ జ‌రిపి తీరుతామ‌న్నారు. బ‌లం లేకున్నా ప‌వ‌ర్‌లోకి కొన‌సాగాల‌ని అనుకోవ‌డం లేదు. కానీ రాష్ట్రంలో ఎలాంటి ప‌రిస్థితులు ఎందుకు త‌లెత్తాయో ప్ర‌జ‌లంద‌రికీ తెలియాల‌న్నారు కుమార‌స్వామి. 

కామెంట్‌లు