విండీస్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా జ‌ట్లు ఖ‌రారు - ప్ర‌క‌టించిన ఎంఎస్‌కె

ప్ర‌పంచ క‌ప్‌లో సెమీ ఫైన‌ల్ దాకా వెళ్లి కివీస్‌తో ఓట‌మి పాలైన భార‌త క్రికెట్ జ‌ట్టు స‌భ్యులు తిన్న‌గా ఇండియాకు వచ్చేశారు. ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీ అయి పోయారు. తాజాగా వెస్టిండీస్ లో టీమిండియా మూడు ఫార్మాట్‌ల‌లో ఆడాల్సి ఉంది. ఎవ‌రు ఉంటారో ..ఎవ‌రు ఊడి పోతారోన‌నే ఉత్కంఠ దేశ వ్యాప్తంగా నెల‌కొన్న‌ది. ఇప్ప‌టికే భార‌త క్రికెట్ బోర్డు సెల‌క్ష‌న్ క‌మిటీపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. పాలిటిక్స్ జోక్యం ఎక్కువ కావ‌డం, స‌రైన జ‌ట్టును ఎంపిక చేయ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్‌లో నాలుగో ప్లేస్‌లో ఆట‌గాళ్లు కుదుర‌క పోవ‌డం, జ‌ట్టులో కెప్టెన్, వైస్ కెప్టెన్‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కూడా అప‌జ‌యానికి కూడా కార‌ణ‌మైంద‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇండియాకు ప్ర‌పంచ క‌ప్‌ను తీసుకు వ‌చ్చిన మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ ఉన్నా సెమీ ఫైన‌ల్‌లో భార‌త్‌ను గ‌ట్టెక్కించ లేక పోయాడు. రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఈ ఆట‌గాడు ఇంకా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌లేదు. కానీ విండీస్ టూర్‌కు తాను అందుబాటులో ఉండ‌లేనంటూ ముందే బీసీసీఐకి తెలియ ప‌రిచాడు. దీంతో టీమిండియా జ‌ట్ల ఎంపికకు అడ్డు లేకుండా పోయింది. మీడియాతో మాట్లాడిన ఎంఎస్‌కె రాయుడును ఎందుకు తీసుకోలేదో వివ‌ర‌ణ కూడా ఇచ్చాడు. రెండు రోజుల కింద‌టే ముంబ‌యిలో బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశ‌మైంది..అర్ధాంత‌రంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జ‌ట్ల ఎంపిక కొలిక్కి రాక పోవ‌డం, తీవ్ర ఆరోప‌ణ‌లు రావ‌డంతో వాటిని సాధ్య‌మైనంత వ‌ర‌కు రానీయ‌కుండా చేసేందుకు క‌మిటీ చాలా క‌ష్ట‌ప‌డింది. ఆచి తూచి ఎంపిక చేసింది. రాయుడు స్థానంలో విహారికి ప్లేస్ ఇచ్చింది. ఎంఎస్‌కె ప్ర‌సాద్ నేతృత్వంలో జ‌రిగిన సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశానికి ఇండియ‌న్ జ‌ట్టు కెప్టెన్ కోహ్లితో స‌హా ప‌లువురు బీసీసీఐ అధికారులు హాజ‌ర‌య్యారు. వ‌చ్చే నెల ఆగ‌స్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వ‌న్డేల‌తో పాటు రెండు టెస్ట్ మ్యాచ్‌ల‌ను ఇండియా ఆడ‌నుంది. ఈ మూడు ఫార్మాట్‌ల‌కు విరాట్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కోహ్లి రెస్ట్ తీసుకుంటాడ‌ని, విండీస్ టూర్‌కు దూరంగా ఉంటాడ‌ని జ‌రిగిన ప్ర‌చారంలో నిజం లేద‌ని తేలిపోయింది. ధోనీ రెండు నెల‌ల పాటు విశ్రాంతి తీసుకుంటున్న నేప‌థ్యంలో ..ఆయ‌న స్థానంలో రిష‌బ్ పంత్‌కు అవ‌కాశం ద‌క్కింది.

ఇక టీమిండియా జ‌ట్లు ఇలా ఉన్నాయి. టీ20 జ‌ట్లుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా రోహిత్ శ‌ర్మ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. శిఖ‌ర్ ధావ‌న్, కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్, మ‌నీష్ పాండే , రిష‌బ్ పంత్  ( వికెట్ కీప‌ర్ ) , కృనాల్ పాండ్య‌, ర‌వీంద్ర జ‌డేజా, వాషింగ్ట‌న్ సుంద‌ర్, రాహుల్ చాహ‌ర్, భువనేశ్వ‌ర్ కుమార్, ఖ‌లీల్ అహ్మ‌ద్, దీప‌క్ చాహ‌ర్, న‌వ‌ద‌వీప్ షైనీని ఎంపిక చేశారు. ఇక వ‌న్డే జ‌ట్టుకు కూడా కోహ్లి, రోహిత్‌లు కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. స‌భ్యులుగా శిఖ‌ర్ ధావ‌న్, కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్, మ‌నీష్ పాండే, రిష‌బ్ పంత్ (కీప‌ర్ ) , ర‌వీంద్ర జ‌డేజా, కుల‌దీప్ యాద‌వ్, యుజువేంద్ర చాహ‌ల్, కేదార్ జాద‌వ్, మ‌హ్మ‌ద్ ష‌మి, భువ‌నేశ్వ‌ర్ కుమార్, ఖ‌లీల్ అహ్మ‌ద్, న‌వ‌దీప్ షైనీ ఎంపిక‌య్యారు. టెస్ట్ జ‌ట్టుకు కోహ్లినే కెప్ట‌న్‌గా ఉండ‌గా, అజింక్యా రెహానే వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. మ‌యాంక్ అగ‌ర్వాల్, కేఎల్ రాహుల్, చ‌టేశ్వ‌ర పూజారా, హ‌నుమ విహారి, రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్ (కీప‌ర్ ) , ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజా, కుల్‌దీప్ యాద‌వ్, ఇషాంత్ శ‌ర్మ‌, మ‌హ్మ‌ద్ ష‌మి, జ‌స్ప్రిత్ బుమ్రా, ఉమేష్ యాద‌వ్‌లు ఎంపిక‌య్యారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!