పాక్ కు మళ్ళీ భంగపాటు

మరోసారి పాకిస్తాన్ కు భంగపాటు ఎదురైంది. భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు పాక్ ప్రయత్నం చేసింది. చైనా సాయంతో వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించేందుకు పాక్ ప్రయత్నించగా మండలిలో మిగిలిన సభ్యులెవరూ మద్దతివ్వక పోవడంతో ఏకాకిగా మిగిలి పోయింది. కశ్మీర్ అంశం ద్వైపాక్షిక మైనందున దానిపై చర్చించడం కుదరదని, మండలిలోని ఇతర సభ్యులు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే పాకిస్తాన్ తనకు కష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. పాక్ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి వేదికగా పదే పదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. పాక్ ప్రయత్నమంతా దృష్టి మరల్చేందుకేనని మిగిలిన సభ్యులు గుర్తించడం సంతోషకరం. సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక పద్ధతులు ఉన్నాయని భద్రత సమితి సభ్యులు పాక్‌కు గుర్తు చేశారు అని ఆయన వివరించారు. దురుద్దేశ పూర్వక ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటేనని, సమితి సభ్యులు సూచించినట్టుగా సమస్యల పరిష్కారానికి కొన్ని కష్టమైన చర్యలు తీసుకోవడమే ఆ దేశానికి మేలని ఆయన అన్నారు. చైనా...