అబ్బా టిక్ టాక్ దెబ్బ



సోషల్ మీడియాలో టాప్ పొజిషన్ లో గత కొంత కాలంగా టాప్ పొజిషన్ లో కొనసాగుతూ వస్తున్న ముఖ పుస్తకం కు షాక్ ఇచ్చింది చైనాకు చెందిన దిగ్గజ కంపెనీ టిక్ టాక్. ఇప్పటికే కోట్లాది మందిని కలిగిన పేస్ బుక్ ను టిక్ టాక్ నెట్టేసింది. సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ ఎంతో పాపులర్‌ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా ఇది మరోసారి రుజువైంది. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా టిక్‌ టాక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌లు జరిగాయి. ఈ విషయాన్ని ప్రముఖ మార్కెటింగ్ సంస్థ సెన్సార్‌ టవర్‌ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ను వెనక్కి నెట్టి వేసిందని పేర్కొంది. 2018లో డౌల్‌లోడ్స్‌ పరంగా నాలుగో స్థానంలో ఉన్న టిక్‌టాక్‌.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఫేస్‌బుక్‌ మేసెంజర్‌, ఫేస్‌బుక్‌ యాప్‌లను అధిగమించి రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది.
టిక్‌టాక్‌ యాప్‌ రెండో స్థానంలో నిలవడానికి ఇండియానే ప్రధాన కారణమని తెలిపింది. ఎందుకంటే ఆ యాప్‌ను తొలిసారి డౌన్‌లోడ్‌ చేసుకున్నవారిలో 45 శాతం భారత్‌ నుంచే ఉన్నట్టు పేర్కొంది. అయితే డౌన్‌లోడ్స్‌ పరంగా వాట్సాప్‌ యాప్‌ను టిక్‌టాక్‌ క్రాస్‌ చేయలేక పోయింది. దాదాపు 850 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌తో వాట్సాప్‌ యాప్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. 2019 చివరి మూడు నెలల్లో వాట్సాప్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌లో 39 శాతం పెరుగుదల కనిపించిందని ఆ సంస్థ పేర్కొంది.
సెన్సార్‌ టవర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం వాట్సాప్‌ మొదటి స్థానంలో, టిక్‌టాక్‌ రెండో స్థానంలో, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ మూడో స్థానంలో, ​ఫేస్‌బుక్‌ 4వ స్థానంలో, ఇన్‌స్టాగ్రామ్‌ 5వ స్థానంలో నిలిచాయి. ఇందులో టిక్‌టాక్‌ తప్ప మిగిలిన నాలుగు యాప్‌లు కూడా ఫేస్‌బుక్‌ సంస్థకు చెందినవే ఉండడం గమనార్హం. మొత్తం మీద టిక్ టాక్ దెబ్బకు ఈ అమెరికా కంపెనీ దిగ్గజం అబ్బా అంటోంది. కాగా టిక్ టాక్ ఇచ్చిన షాక్ తో పేస్ బుక్ పునరాలోచనలో పడింది. ఎలాగైనా సరే టిక్ టాక్ ను ఝలక్ ఇవ్వాలని అనుకుంటోంది పేస్ బుక్.

కామెంట్‌లు