కొలువు చేస్తూ చదువు - హెచ్‌సీఎల్ శ్రీకారం

ఒక్కో ఐడియా ఒక్కో సంస్థను గట్టెక్కించేలా చేస్తే..ఇంకో ఐడియా ఇతర కంపెనీలను విస్తుపోయేలా చేస్తుంది. అలాంటి అద్భుతమైన ఆలోచనకు కార్యరూపం కల్పిస్తోంది ఐటీ దిగ్గజ కంపెనీగా పేరొందిన హెచ్‌సీఎల్ ఐటీ కంపెనీ యాజమాన్యం. ఇంటర్మీడియట్ పూర్తయిన స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూ ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటుంది. ఆ తర్వాత వారే తమ కంపెనీ అవసరాలకు తగ్గట్టు శిక్షణ ఇప్పిస్తుంది. ఫీజు 2 లక్షల రూపాయలు. ఎంపికైన వారికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. ఎంపికైన వారికి నెల నెలా స్టయిఫండ్ కింద 10, 000 వేల రూపాయలు ఇస్తుంది. హైదరాబాద్‌లోని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ టెక్ బీ అని ఈ ప్రోగ్రాంకు పేరు పెట్టింది. రెండేళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని తమ కంపెనీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లో వీరికి బోధన, ప్రాక్టికల్స్ ఉంటాయి. భోజన వసతి సౌకర్యం కంపెనీ చూసుకుంటుంది. శిక్షణ అనంతరం తమ కంపెనీలోనే వీరికి వివిధ విభాగాలలో, వారు శిక్షణ లో చూపించిన ప్రతిభ, పాటవాల ఆధారంగా దేశంలో కానీ ఇతర దేశాలల...