కొలువు చేస్తూ చదువు - హెచ్‌సీఎల్ శ్రీకారం
ఒక్కో ఐడియా ఒక్కో సంస్థను గట్టెక్కించేలా చేస్తే..ఇంకో ఐడియా ఇతర కంపెనీలను విస్తుపోయేలా చేస్తుంది. అలాంటి అద్భుతమైన ఆలోచనకు కార్యరూపం కల్పిస్తోంది ఐటీ దిగ్గజ కంపెనీగా పేరొందిన హెచ్‌సీఎల్ ఐటీ కంపెనీ యాజమాన్యం. ఇంటర్మీడియట్ పూర్తయిన స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూ ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటుంది. ఆ తర్వాత వారే తమ కంపెనీ అవసరాలకు తగ్గట్టు శిక్షణ ఇప్పిస్తుంది. ఫీజు 2 లక్షల రూపాయలు. ఎంపికైన వారికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. ఎంపికైన వారికి నెల నెలా స్టయిఫండ్ కింద 10, 000 వేల రూపాయలు ఇస్తుంది.
హైదరాబాద్‌లోని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ టెక్ బీ అని ఈ ప్రోగ్రాంకు పేరు పెట్టింది. రెండేళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని తమ కంపెనీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లో వీరికి బోధన, ప్రాక్టికల్స్ ఉంటాయి. భోజన వసతి సౌకర్యం కంపెనీ చూసుకుంటుంది. శిక్షణ అనంతరం తమ కంపెనీలోనే వీరికి వివిధ విభాగాలలో, వారు శిక్షణ లో చూపించిన ప్రతిభ, పాటవాల ఆధారంగా దేశంలో కానీ ఇతర దేశాలలో కాని అకామిడేట్ చేస్తారు. ఇలాంటి ప్రయోగాన్ని గత ఏడాదిలో కూడా హెచ్‌సీఎల్ చేసింది. అది వర్కవుట్ కావడంతో ..ఈసారి కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఇదే పద్ధతిన 700 మంది విద్యార్థులను తీర్చిదిద్దింది.
పరీక్షలు రాసి, కాలేజీల్లో, క్యాంపస్‌లలో చేరి నానా తంటాలు పడి శిక్షణ పొంది పాసయ్యాక ..ఉద్యోగం దొరుకుతుందో లేదోనన్న బెంగ లేకుండా చేసింది ఈ కంపెనీ. దేశ వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ప్రస్తుతానికి మాత్రం తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , హర్యాణ, యుపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ఈ ఛాన్స్ ఇచ్చామని స్పస్టం చేశారు ..హెచ్‌సీఎల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశ్నార్క్. దీని వల్ల ఎలాంటి భయాలు ఉండవు. కొలువు రాదన్న బెంగ అంటూ ఉండదు. ట్రైనింగ్ కోసం ప్రత్యేకంగా డెవలపింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అందరూ చదువు అయిపోయాక వేతనాలు పొందుతారు. కానీ ఇక్కడ అలా కాదు..వేతనం తీసుకుంటూనే తమకు ఇష్టం వచ్చిన కోర్సుల్లో చదువుకుంటారు. పని చేస్తూనే ఉద్యోగం నిర్వహిస్తారు. ఇది ఒకరకంగా ఇంటర్నిషిప్ గా పనికి వస్తుంది. ఇంటర్ పూర్తి చేసిన వారు తప్పనిసరిగా 60 శాతం మార్కులు పొంది వుండాలి. హెచ్‌సీఎల్ ఇచ్చిన ఆఫర్ పొందాలంటే కొంచెం కష్టపడాల్సి వుంటుంది. ముందుగా వారు పెట్టే పరీక్ష పాస్ కావాలి. ఆ తర్వాత మాక్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దానిని కూడా ఫేస్ చేయాలి. 10 వేల ప్రారంభ వేతనం ఉంటుందని వీపీ తెలిపారు. ఇందులో సెలెక్ట్ అయిన విద్యార్థులకు బిట్స్ పిలాని, శస్త్ర యూనివర్శిటీలు శిక్షణ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని వెల్లడించారు. ట్రైనింగ్ పూర్తయ్యాక సంవత్సరానికి రెండున్నర లక్షల జీతం అందుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి