చెల‌రేగిన ఇంగ్లండ్ ..చేతులెత్తేసిన వెస్టిండీస్

ప్ర‌పంచ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా వెస్టిండీస్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మ‌దు చేసుకుంది. సౌథాంప్ట‌న్‌లో జ‌రిగిన మ్యాచ్‌కు భారీ ఎత్తున అభిమానులు హాజ‌ర‌య్యారు. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 94 బంతులు ఆడి 100 ప‌రుగులు చేసి చివ‌రి వ‌ర‌కు నాటౌట్‌గా నిలిచిన జో..రూట్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లున్నాయి. విండీస్ నిర్దేశించిన 219 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 33.1 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి సునాయ‌సంగా విజ‌యం సాధించింది. రూట్‌తో పాటు ఓపెనర్లు ఫ్లో 45 , క్రిస్ వోక్స్ 40 ప‌రుగులు చేసి గెలుపులో కీల‌క పాత్ర పోషించారు. రూట్ కు స‌పోర్ట్‌గా నిలిచారు. 

అంత‌కు ముందు వెస్టిండీస్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో త‌క్కువ స్కోరు న‌మోదు చేసింది. ఆర్చ‌ర్ 30 ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీయ‌గా వుడ్ 18 ప‌రుగులు ఇచ్చి 3 కీల‌క వికెట్లు తీశారు. వీరి ధాటికి విండీస్ బ్యాట్స్ మెన్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలువ‌లేక పోయారు. 44.4 ఓవ‌ర్ల‌లోనే 212 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యారు. పూర‌న్ 78 బంతులు ఆడి 3 ఫోర్లు ఒక భారీ సిక్స‌ర్‌తో 63 ప‌రుగులు చేయ‌గా, హెట్ మెయిర్ 48 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 39 ప‌రుగులు చేశాడు. ఇక స్టార్ ప్లేయ‌ర్ క్రిస్ గేల్ 41 బంతులు ఆడి 3 ఫోర్లు ఒక సిక్స‌ర్ సాయంతో 36 ప‌రుగులు చేశారు. ఈ ముగ్గురు ఆట‌గాళ్ల స్కోర్ తో ఆ మాత్రం ప‌రుగులు చేయ‌గ‌లిగింది విండీస్ జ‌ట్టు. 

స్వంత గ‌డ్డ‌పై ఆడ‌డం ఇంగ్లండ్ జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు క‌లిసొచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు శుభారంభ‌మే దొరికింది. మూడో ఓవ‌ర్ ఆఖ‌రు బంతికి ఓపెన‌ర్ లూయిస్ ను వోక్స్ పెవీలియ‌న్‌కు పంపించాడు. గేల్ బ్యాట్ ఝులిపించినా ఫ్లంకెట్ బౌలింగ్‌లో ఫ్లోకు ఈజీ క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. హోప్ క్రీజులోకి వ‌చ్చినా ఎక్కువ సేపు బౌల‌ర్ల‌ను ఎదుర్కోలేక వెనుదిరిగాడు. క‌ష్టాల్లో ఉన్న విండీస్ ను మైయ‌ర్‌తో క‌లిసి పూర‌న్ మెల మెల్ల‌గా స్కోర్‌ను ప‌రుగులు పెట్టించాడు. బాగా ఆడుతున్న వీరిద్ద‌రిలో హెట్ మైయ‌ర్‌ను రూట్ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. మిగ‌తా వారు ఆడ‌క పోవ‌డంతో ఆ మాత్రం స్కోర్ చేయ‌గ‌లిగింది. ఒక వేళ గేల్ మైదానంలో వుండి వుంటే..ఆట తీరు మ‌రోలా వుండేది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ త‌న ఖాతాలో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!