రిల‌య‌న్స్ ..రిల‌య‌బుల్ కంపెనీ..ఫోర్బ్స్ గ్లోబ‌ల్ లిస్టులో చోటు

భార‌తీయ టెలికాం రంగంలో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచి..ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచిన కంపెనీగా ముఖేష్ అంబానే నేతృత్వంలోని రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన గ్లోబ‌ల్ కంపెనీల జాబితాలో 71వ ర్యాంకును సాధించింది. త‌న‌కు ఇక ఎదురే లేదంటూ దూసుకెళుతోంది. ఇండియాలో టెలికాం సేవ‌లు అనే స‌రిక‌ల్లా భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ కంపెనీ ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది. దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీ హ‌యాంలో టెలికాం రంగం కొత్త పుంత‌లు తొక్కింది. సాంకేతిక ప‌రిజ్ఞానం భ‌విష్య‌త్‌ను శాసిస్తుంద‌ని ఆయ‌న ఏనాడో గుర్తించారు. అందుక‌నే టెలికాం వ్య‌వ‌స్థ‌కు జీవం పోశేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆయ‌న పీఎంగా ఉన్న‌ప్పుడే శ్యాం పిట్రోడాను ఇక్క‌డికి పిలిపించారు. పిట్రోడా అంటేనే టెలికాం. ఆ రంగాన్ని ప‌రుగులు పెట్టించారు. 

బీఎస్ఎన్ఎల్ ఒక బ్రాండ్‌గా ఎదిగింది. ల‌క్ష‌లాది మందికి నీడ‌నిచ్చింది. కోట్లాది మందిని క‌స్ట‌మ‌ర్స్‌గా మార్చుకుంది. కానీ ఇదే స‌మ‌యంలో ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు ఒక్క‌సారిగా కుదుపున‌కు గురి చేశాయి. ప్రైవేట్ టెలికాం ఆప‌రేట‌ర్లు వెల్లువ‌లా ప్ర‌పంచాన్ని చుట్టు ముట్టారు. దీనిని ఆస‌రాగా తీసుకుని ఇండియాలో కూడా ట్రాయ్ నిబంధ‌న‌ల మేర‌కు త‌మ సేవ‌ల‌ను ప్రారంభించారు. 2జి, 3జి, 4జి సేవ‌లు అందుబాటులోకి ఎప్పుడైతే వ‌చ్చాయో..అప్ప‌టి నుంచి ఈ రంగంపై అధికారిక టెలికాం సంస్థ బీఎస్ ఎన్ ఎల్ త‌న ప‌ట్టును కోల్పోయింది. ఇపుడు న‌ష్టాల్లో కూరుకు పోయింది. దీనికి కాయ‌క‌ల్ప చికిత్స చేసేందుకు కేంద్ర స‌ర్కార్ యోచిస్తోంది. మ‌రో వైపు ఎయిర్ ఇండియా కూడా దివాలా అంచున నిల‌బ‌డింది. దానిని గ‌ట్టెక్కించే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. ఇదే స‌మ‌యంలో రాకెట్ లాగా దూసుకు వ‌చ్చింది అంబానీ ఆధ్వ‌ర్యంలోని రిల‌య‌న్స్. టెలికాం, ఆయిల్, గ్యాస్ ఇలా ప్ర‌తి రంగంలో ఎంట‌రైంది. 

లాజిస్టిక్, డిజిట‌ల్ మార్కెటింగ్, సిమెంట్, ఎంట‌ర్ టైన్‌మెంట్, టెక్నాల‌జీ ..స్పోర్ట్స్ ..అన్నింట్లోకి అడుగు పెట్టింది రిల‌య‌న్స్ కంపెనీ. అంచెలంచెలుగా త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రించుకుంటూ పోయింది. తాజాగా రిల‌య‌న్స్ జియో పేరుతో అతి త‌క్కువ ధ‌ర‌కు డేటా, వాయిస్ కాల్స్ వినియోగం ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. ఇపుడు దేశ‌మంత‌టా రిల‌య‌న్స్ లేకుండా ఊరు లేదు..గ‌ల్లీ లేదు. ఇండియా అంటే రిల‌య‌న్స్..రిల‌య‌న్స్ అంటే భార‌త్ అన్న పేరు తెచ్చుకుంది. ల‌క్ష‌లాది మందికి మార్కెటింగ్‌లో శిక్ష‌ణ ఇస్తోంది. వేలాది మందికి ఉపాధి క‌ల్పిస్తోంది ఈ సంస్థ‌. మ‌రో వైపు దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల‌ను పెద్ద ఎత్తున ప్రారంభించింది. న‌ష్టాలు రావ‌డంతో ఉన్న‌ట్టుండి మూసి వేసింది. 

భార‌తీ ఎయిర్ టెల్, వొడాఫోన్, యూనినార్, త‌దిత‌ర కంపెనీల ఆధిప‌త్యాన్ని ఒకే ఒక్క డిసిష‌న్ తో రిల‌య‌న్స్ కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది. అన్ని కంపెనీలు రిల‌య‌న్స్ ను తేలిగ్గా తీసుకున్నాయి. ప‌ప్పులో కాలేశాయి. ఇపుడు ఎక్క‌డికి వెళ్లినా జియోనే ద‌ర్శ‌న‌మిస్తోంది. బిగ్ ఆఫ‌ర్ల దెబ్బ‌తో పాటు నెట్ క‌నెక్టివిటి మ‌రింత వేగ‌వంతం కావ‌డంతో కోట్లాది టెలికాం క‌స్ట‌మ‌ర్లు ఉన్న‌ట్టుండి మిగ‌తా ప్రైవేట్ టెలికాం ఆప‌రేట‌ర్ల నుంచి జియోకు మారిపోయారు. దీంతో ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ‌మంది వినియోగ‌దారులు క‌లిగిన టెలికాం కంపెనీగా రిల‌య‌న్స్ అవ‌త‌రించింది. 5 కోట్ల‌కు పైగా క‌స్ట‌మ‌ర్లు క‌లిగి ఉన్న కంపెనీగా చ‌రిత్ర సృష్టించింది. దీనికంత‌టికి కార‌ణం ముఖేష్, టీనా అంబానీల ముద్దుల కూతురు, కొడుకుల చేతుల్లోకి కంపెనీ వెళ్ల‌డ‌మే. 

తాజాగా ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ విడుద‌ల చేసిన ప్ర‌పంచంలో అతి పెద్ద ప‌బ్లిక్ కంపెనీల జాబితాను ప్ర‌క‌టించింది. మొత్తం 2000 కంపెనీల‌తో లిస్ట్ విడుద‌ల చేయ‌గా ..అందులో ఇండియాకు చెందిన కంపెనీలు 57 వున్నాయి. వీటిలో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ టాప్ ర్యాంక్ ఇండియ‌న్ కంపెనీగా నిలిచింది. దీని ర్యాంకు 71గా నిర్ణ‌యించింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లో తీసుకుంటే ..రిల‌య‌న్స్ గ్లోబ‌ల్ ర్యాంక్‌ను 11వ స్థానం కేటాయించింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డిఎఫ్‌సీ లిమిటెడ్ కూడా టాప్ టెన్ గ్లోబ‌ల్ క‌న్స్యూమ‌ర్ ఫైనాన్స్ సంస్థ‌ల్లో ఒక‌టిగా నిలిచింది. గ్లోబ‌ల్‌గా చూస్తే దీని ర్యాంక్ 332వ ర్యాంకు స్వంతం చేసుకుంది. ఇక అమెరిక‌న్ ఎక్స్ ప్రెస్ టాప్‌లో ఉంది. మొత్తం లిస్ట్‌లో ఇండ‌స్ట్రియ‌ల్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంక్ ఆఫ్ చైనా వ‌రుస‌గా ఏడో ఏడాది టాప్‌లో నిలిచింది. 

ప్ర‌క‌టించిన జాబితాలో 61 దేశాల‌కు చెందిన కంపెనీలున్నాయి. అమెరికా నుంచి అత్య‌ధికంగా 575 కంపెనీలు ఈ లిస్టులో చోటు పొందాయి. చైనా అండ్ హాంకాంగ్ నుంచి 309, జ‌పాన్ నుంచి 223 కంపెనీలు ఇందులో ఉన్నాయి. మొత్తంగా చూస్తే టాప్ టెన్‌లో నిలిచిన కంపెనీల్లో ఐసీబీసి త‌ర్వాత జేపీ మోర్గాన్, చైనా క‌న్‌స్ట్ర‌క్ష‌న్ బ్యాంక్, అగ్రిక‌ల్చ‌ర్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఆపిల్, పింగ్ యాన్ ఇన్సూరెన్స్ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ చైనా, రాయ‌ల్ ట‌చ్ షెల్ వెల్ఫ్ ఫార్గోలున్నాయి. ఇండియా నుంచి టాప్ 200లో నిలిచింది ఒకే ఒక్క కంపెనీ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్. 

హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ 209, ఓఎన్‌జీసీ 220, ఇండియ‌న్ ఆయిల్ 288, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, ఎస్‌బిఐ, ఎన్‌టీపీసీ కంపెనీలు టాప్ 500లో చోటు ద‌క్కించుకున్నాయి. దీంతో పాటు టాటా స్టీల్, కోల్ ఇండియా, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్, భార‌త్ పెట్రోలియం, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ, భార‌తీ ఎయిర్ టెల్, విప్రో, జెఎస్ డ‌బ్ల్యు స్టీల్, ప‌వ‌ర్ గ్రిడ్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ ఎం, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్, బ‌జాన్ ఫిన్ స‌ర్వ్, గెయిల్, గ్రాసిమ్, పీఎన్‌బి, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ప‌వ‌ర్ ఫైనాన్స్, కెన‌రా బ్యాంకులు ఉన్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!