జుంబోటెయిల్ స్టార్టప్‌లో బిగ్ ఇన్వెస్ట్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఎక్కువగా అవుట్ సోర్సింగ్ ద్వారా పనులు చేపుడుతున్న కంపెనీలన్నీ బెంగళూరు సిటీలోనే కొలువు తీరాయి. తాజాగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాలు చేరినా..బెంగళూరు మాత్రం తన హవాను ఇంకా కొనసాగిస్తూనే వున్నది. విదేశాల ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ ఇక్కడి సంస్థలతో ఎంఓయులు చేసుకుని పనులు అప్పగిస్తున్నాయి. లెక్కలేనన్ని ప్రాజెక్టులతో ఐటీ కళకళలాడుతోంది. ఇక్కడి ప్రభుత్వం కూడా ఐటీ రంగానికి మరిన్ని వెసలుబాట్లు కల్పిస్తున్నాయి. దీంతో ఔత్సాహికులు, ఐడియాలు కలిగిన వాళ్లు, యువతీ యువకులు, ఏదో సాధించి తీరాలన్న ఉత్సాహవంతులు , అంకురాలను ప్రారంభించే వారితో పాటు ఆంట్రప్రెన్యూర్స్‌కు హై లేవల్‌లో ప్రయారిటీ దక్కుతోంది.
దీంతో కంపెనీలన్నీ గంప గుత్తగా కాకుండా ఒక్కో కంపెనీ ఒక్కో స్ట్రాటజీతో ముందుకెళుతోంది. బిపిఓ, కేపీఓ రంగాలలో ఎక్కువగా ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తుండగా తాజాగా టెక్నాలజీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కొలువులు దక్కుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్, మెషిన్ లర్నింగ్, ఎథికల్ హ్యాకింగ్, రోబోటిక్స్, సోలార్ టెక్నాలజీ తో పాటు టెలికాం రంగంలో చోటు చేసుకున్న పెను మార్పులకు అనుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతానికి జియోతో పోటీపడేందుకు ఏ కంపెనీ ముందుకు రావడం లేదు. దరిదాపుల్లో ఎయిర్ టెల్ ఉన్నా ..మొత్తం సగానికి పైగా కస్టమర్లను జియో తన వైపు లాగేసుకుంది. ఇంకేం దిగ్గజ టెలికాం కంపెనీలన్నీ విలవిలలాడి పోతున్నాయి.
జియో మార్కెట్ స్ట్రాటజీని చూసి ఏం చేయాలో పాలు పోవడం లేదు ఆయా కంపెనీలకు. బెంగళూరులో ఎక్కువగా స్టార్టప్ కంపెనీలే ప్రారంభమవుతున్నాయి. చాలా అంకురాలు సక్సెస్ బాట పట్టాయి. మరికొన్ని ఆదిలోనే ఇబ్బందులకు గురవుతున్నాయి. జుంబుటెయిల్ స్టార్టప్ విజయవంతంగా నడుస్తోంది. సప్లై చెయిన్ , ప్లాట్ ఫాం విత్ పీఓఎస్ మెషీన్స్, ఫార్మర్స్ ఓరియంటెడ్ గా ఉంటోంది. కిరాణా దుకాణాలలో బ్రాండ్స్ , గ్రోసరీ ప్రొడక్ట్స్ ను సేల్ చేస్తోంది. ఈ ఐడియా వర్కవుట్ అయింది. ఫుండ్ అండ్ గ్రోసరీ వస్తువులకు సంబంధించి ఏకమొత్తంగా ఓ మార్కెట్ ప్లేస్‌ను క్రియేట్ చేసింది ఈ సంస్థ. 90 కోట్లను సమీకరించింది.
హెరోన్ రాక్, కాప్నా ఫండ్, బిఎన్‌కే వెంచర్స్, విలియం జార్విస్, నెక్సస్ వెంఛర్ పార్ట్‌నర్స్ అండ్ కిలారీ కేపిటల్ లు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ క్రెడిట్ అంతా జంబుటెయిల్ నిర్వాహకులదే. ఈ స్టార్టప్ తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. మెషీన్స్, ఫార్మర్స్ ను కలిపి ప్రొడక్ట్స్‌ను సేల్ చేయడం ప్రధానం. మొత్తం నగరంలోని 20 వేల కిరాణా దుకాణాలు, స్మాల్ స్ట్రీట్స్‌లోని చిరు వ్యాపారులను అనుసంధానం చేసింది. స్టాప్‌లెస్, పల్సెస్, ఎఫ్ఎంసీజీ గూడ్స్ ఇందులో అమ్మకానికి ఉన్నాయి. క్రెడిట్ పద్ధతిన చెల్లింపు విధానం అమలు చేస్తున్నారు. 2017లో 8.5 మిలియన్ పీపుల్స్‌కు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఓ రికార్డు. కార్తిక్ వెంకటేశ్వరన్, ఆసిష్ జినాలు ఈ స్టార్టప్ వ్యవస్థాపకులుగా ఉన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి