ప్రియాంకను వరించిన అంతర్జాతీయ పురస్కారం
బాలీవుడ్ బ్యూటీగా ..హాలీవుడ్ స్థాయిలో అద్భుతమైన నటిగా పేరొందిన ప్రియాంక చోప్రాకు అరుదైన పురస్కారం లభించింది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులను ఈ నటిమణి పొందింది. తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకుంది. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా అందించే యూనిసెఫ్ అమెరికా డానీ కేయి మానవతా పురస్కారానికి ఎంపికైంది. బాలల విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను ప్రియాంక చోప్రాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ఏడాది ఆఖరులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని స్పెషల్‌గా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది.
ఆమె ప్రస్తుతం ది స్కై ఈజ్ పింక్ సినిమాలో నటిస్తోంది. సోనాలి బోస్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీకి. అమెరికాకు చెందిన నటుడితో ప్రేమలో పడింది. అక్కడే ఎక్కువగా ఉంటోంది ఈ తార.
1982 జూలై 18న జన్మించిన ఈ సుందరీమణి..నటిగా, గాయకురాలిగా, ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా వున్నారు. 2000 సంవత్సరంలో నిర్వహించిన అంతర్జాతీయ అందాల పోటీలో మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. బాలీవుడ్‌లో ఎక్కువ పారితోషకం తీసుకునే నటీమణుల్లో ప్రియాంక చోప్రా ఒకరు. నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు. 2016లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
2017తో పటు 2018 సంవత్సరాలకు గాను టైమ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితం చేసిన 100 మంది వ్యక్తుల్లో ప్రియాంక చోప్రా కూడా ఒకరుగా ఎంపికయ్యారు. ఇది ఆమె కెరీర్‌లో గొప్ప విజయంగా భావించాలి. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మహిళల్లో ప్రియాంక కూడా చోటు దక్కించుకున్నారు. చదువు రీత్యా చోప్రా ..ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. 2003లో ద లవ్ స్టోరీ మూవీలో నటించారు. ఇదే ఇయర్‌లో వచ్చిన అందాజ్ సినిమా బాక్సాఫిస్ వద్ద విజయం సాధించింది. 2004లో ముజే షాదీ కరోగీ, ఎతిరాజ్ 2006లో వచ్చిన మూవీ ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది.
క్రిష్ , డాన్ మూవీస్‌లలో ప్రధాన రోల్స్ లో నటించి ప్రియాంక మెప్పించారు. కామినే, ఖూన్ మాఫ్, బార్ఫి, మేరీకోం, బాజీరావ్ మస్తానీ సినిమాలు ఆమెను నటీమణిగా నిలబెట్టాయి. హాలీవుడ్‌లో కామెడీ బేవాచ్ లో , ఇట్స్ రొమాంటిక్ లలో సపోర్టింగ్ రోల్ పోషించారు. ఫిలాంథ్రోఫిస్ట్‌గా 2006 నుంచి యునిసెఫ్లో పనిచేస్తున్నారు. ఇదే సంస్థకు గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్నారు. పర్యావరణం, ఆరోగ్యం, విద్య, మహిళా హక్కులు, జెండర్ , ఫెమినిజం, ఇలా ప్రతి ఫార్మాట్‌లో ఆమె తన వాయిస్ వినిపించారు. అమెరికా సింగర్, యాక్టర్ నిక్ జోన్స్ ను పెళ్లి చేసుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి