రేపే అసలైన పోరు - దాయాదుల మధ్య వార్
తుపాకులు లేవు..తూటాలు లేవు..మారణాయుధాలు లేవు..మిస్సైల్స్ అంతకన్నా లేవు..రాకెట్ లాంఛర్లు లేవు. కానీ రేపు యుద్ధం జరగబోతోంది. అది ఆషామాషీ వార్ కాదు. దాయాదుల మధ్య రియల్ యుద్ధానికి వేదిక కాబోతోంది ప్రపంచ కప్ టోర్నమెంట్. అన్ని జట్లు ఆడడం ఒక ఎత్తైతే..పాకిస్తాన్, ఇండియా క్రికెట్ జట్లు తలపడడం మరో ఎత్తు. ఎక్కడలేని టెన్షన్ వాతావరణం, నరాలు తెగిపోయేంత ఉత్కంఠ..కోట్లాది అభిమానుల ఆరాటాలు, పోరాటాలు, ప్రదర్శనలు , లెక్కలేనంత బెట్టింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే..చాలు కోట్లాది మంది టీవీలకు అతుక్కు పోతారు. లక్షలాది మంది తమ కొలువులకు సెలవు పెడతారు.
అందుకే ఆయా కంపెనీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు..ఇతర ప్రాంతాల్లో భారీ ఎత్తున మ్యాచ్ చూసేందుకు వీలు కల్పించారు. అక్కడే టీవీలను ఏర్పాటు చేసి ...చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న స్టార్ టీవీ గ్రూప్‌నకు ఈ ఒక్క మ్యాచ్ ద్వారా కేవలం ప్రకటనల పరంగా చూస్తే 100 కోట్లకు పైగా రెవిన్యూ రానుందని మార్కెట్ వర్గాల అంచనా. మాంచెస్టర్ వేదిక కానుంది. ఐససీ వన్డే ప్రపంచకప్ లో హై టెన్షన్ మ్యాచ్‌కు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇండియా , పాకిస్తాన్ అసలైన సమరం ప్రారంభం కానుంది. అభిమానుల్లో భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఎవరికి వారే తమ జట్లు గెలుస్తాయంటూ పందాలు కాస్తున్నారు. బెట్టింగ్‌లు జోరందుకున్నాయి.
అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్‌లోను ఇండియా జట్టు బలంగా వుంది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఈ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఎలాగైనా సరే పాకిస్తాన్‌ను ఓడించి తీరుతామంటూ కెప్టెన్ కోహ్లి పూర్తిగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. కాకపోతే గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నీ నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ నిష్క్రమించడం భారత జట్టుకు కోలుకోలేని దెబ్బ. మరో వైపు పాకిస్తాన్ జట్టు కూడా అన్ని అస్త్రాలు రెడీ చేసుకుని ఉంది. ఇండియాతో మ్యాచ్ అంటేనే వారికి ఎక్కడలేని బలం వస్తుంంది. అదే ఊపుతో వారు అద్భుతమైన ప్రదర్శన చేసేందుకు రెడీగా ఉన్నామంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు. ఆసియా కప్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు పాకిస్తాన్ తో ఇండియా జట్టు. ఇండియాకే భారీ ఛాన్స్ వుందంటూ క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరు గెలుస్తారనేది రేపటి తో తెలుస్తుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి