అమెజాన్ ఫ్లెక్స్ - చేసుకున్నొళ్ల‌కు చేసుకున్నంత

అమెరికాకు చెందిన అమెజాన్ వినూత్న ఆలోచ‌న‌కు తెర లేపింది. లాజిస్టిక్ రంగంలో ఇప్ప‌టికే ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్న ఈ కంపెనీ..త‌న క‌ష్ట‌మ‌ర్ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించాల‌ని సంక‌ల్పించింది. ఇందులో భాగంగా పార్శిళ్ల‌ను డోర్ డెలివ‌రీ చేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఇందు కోసం స్టూడెంట్స్, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు పార్ట్ టైం జాబ్స్ ఇవ్వ‌నుంది. వీరిని ఎంపిక చేయ‌డం ద్వారా ర‌ద్దీ స‌మ‌యాల్లో మ‌రింత వేగంగా డెలివ‌రీలు చేయ‌డంతో పాటు ఉబెర్ మాదిరి పార్ట్ టైం కొలువులు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని కంపెనీ భావిస్తోంది. ఈ కామ‌ర్స్ వ్యాపారంలో స్పీడ్ డెలివ‌రీ ముఖ్యం. దీనిపై అమెజాన్ స్పాట్ డిసిష‌న్ తీసుకుంది.

వేగంగా పార్శిళ్ల‌ను అందించేందుకు ఈ కంపెనీ గ‌త కొన్నేళ్లుగా వ‌న్ - డే - డెలివ‌రీ - టూ -డే డెలివ‌రీ, నెక్ట్స్ డెలివ‌రీ వంటి విధానాల‌ను అమ‌లు చేస్తోంది. ప్రైమ్ నౌ ఆప్ష‌న్‌ను ప్ర‌వేశ పెట్టింది కొత్త క‌స్ట‌మ‌ర్ల కోసం. ఇందులో స‌భ్యులైతే క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ కూడా ఇస్తోంది అమెజాన్. దీని కోసం ప్ర‌త్యేకంగా ఆప్ త‌యారు చేసింది. దీనిని యూజ్ చేసుకుని కిరాణా సామాగ్రి ఆర్డ‌ర్ చేస్తే రెండు గంట‌ల్లో డెలివ‌రీ ఇస్తోంది. ముఖ్యంగా ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఉన్న వారికి చాలా వ‌స్తువుల‌ను ఆర్డ‌ర్ చేసిన మ‌రుస‌టి రోజే అంద‌జేస్తోంది. ఇక అమెజాన్ ఫ్లెక్స్ లో చేరిన వారు రోజుకు నాలుగు గంట‌ల పాటు ప‌ని చేయాలి. పార్శిళ్ల‌ను చేర‌వేయాలి. గంట‌కు 120 నుంచి 140 రూపాయ‌ల దాకా సంపాదించ‌వ‌చ్చు.

ప్ర‌తి బుధ‌వారం రోజు జీతం ఇస్తారు. లాజిస్టిక్ రంగంలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కంపెనీలు వ‌స్తున్నాయి. పోటీ ఎక్కువ‌గా వుంది. క‌స్ట‌మ‌ర్ల‌ను పోగొట్టుకోకుండా ఉండ‌డంతో పాటు కొత్త వారిని ఎప్ప‌టిక‌ప్పుడు చేరేలా చూడ‌డం కూడా క‌త్తి మీద స్వారీ లాంటిదేనంటున్నారు అమెజాన్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ స‌క్సేనా. ప్ర‌యోగాత్మ‌కంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరులో అమెజాన్‌‌ ఫ్లెక్స్‌‌ సేవలను ప్రారంభించేముందు ఈ సేవలను పరిశీలించింది. త్వరలోనే మరిన్ని నగరాల్లో అమెజాన్‌‌ ఫ్లెక్స్‌‌ను తీసుకొస్తామని సక్సేనా చెప్పారు.అమెజాన్‌‌ ఫ్లెక్స్‌‌ ఇది వరకే ఉత్తర అమెరికా, జర్మనీ, స్పెయిన్‌‌, జపాన్‌‌, సింగపూర్‌‌, ఇంగ్లండ్‌‌లో ఉంది.

ఈ కార్యక్రమం అమలవుతున్న ఏడో దేశం ఇండియా. ఫ్లెక్స్ వల్ల ఈ దేశాల్లో అమెజాన్‌‌ డెలివరీల సామర్థ్యం, వేగం పెరిగింది. అమెజాన్‌‌ ఇండియాలో 2013 నుంచి డెలివరీలు ఇస్తోంది. దాదాపు 99.9 శాతం పిన్‌‌కోడ్‌‌లకు సేవలు అందిస్తోంది. నాలుగు లక్షల మంది సెల్లర్లు అందించే 17 కోట్ల ప్రొడక్టులను డెలివరీ చేస్తోంది. గత ఏడాది ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్లను ఒకటిన్నర రెట్లు పెంచడంతో నిల్వ సామర్థ్యం 2017తో పోలిస్తే రెండు కోట్ల క్యూబిక్‌‌ ఫీట్లు పెరిగింది. మొత్తం మీద ఫ్లెక్స్ కార్య‌క్ర‌మం వ‌ల్ల వేగంగా వ‌స్తువులు అంద‌డంతో పాటు ప‌ది మందికి ఉపాధి దొరుకుతోంద‌న్న‌మాట‌.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!