విమాన ప్ర‌యాణికుల‌కు పండగే పండుగ


ప్రైవేట్ విమాన‌యాన సంస్థ‌ల మ‌ధ్య పోటీ విహంగ ప్ర‌యాణికుల‌కు అద్భుత‌మైన అనుభూతిని మిగుల్చుతోంది. ఒక దానిని మించి మ‌రో సంస్థ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. నిన్నటి వ‌ర‌కు ఎయిర్ ఏషియా, ఎయిరిండియా, ట్రూజెట్, స్పైస్ జెట్, త‌దిత‌ర కంపెనీల‌న్నీ అతి త‌క్కువ ధ‌ర‌కే ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే వారికి అనువుగా వుండేలా , అందుబాటు ధ‌ర‌ల్లో ప్ర‌క‌టించాయి. తాజాగా ఇండిగో టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా వెళ్లేందుకు ఆయా రూట్ల‌లో టికెట్ల ప్రైసెస్ డిక్లేర్ చేసింది ఈ సంస్థ‌. ఆన్ లైన్ ద్వారా టికెట్ల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ఉప‌యోగించు కోవాల‌ని ఇండిగో యాజ‌మాన్యం కోరింది. త‌న అధికారిక వెబ్ సైట్‌లో ఇవి ల‌భ్య‌మ‌వుతాయ‌ని తెలిపింది.

ఈనెల 26 నుండి సెప్టెంబ‌ర్ 28 తేదీ లోపు బుకింగ్ చేసుకున్న తేదీల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని సంస్థ నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. ప్రారంభ టికెట్ ధ‌ర 999 రూపాయ‌ల నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపింది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేట్ నిర్ణ‌యించారు. వివిధ ప్యాకేజీలు, స్కీంలు ప్ర‌వేశ పెట్టారు. ఒక మిలియ‌న్ సీట్ల‌ను ఈ సంద‌ర్భంగా అమ్మ‌కానికి పెట్టింది. ఇదంతా ఎకాన‌మీ, డొమెస్టిక్ టూర్స్‌ల‌కు సంబంధించిన‌వే ఉన్నాయి. ఇండిగో స‌మ్మ‌ర్ సేల్ పేరుతో ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఈరోజు ఆఖ‌రు రోజు అని, దీనిని సాధ్య‌మైనంత వ‌ర‌కు ఉప‌యోగించు కోవాల‌ని కోరింది. ఓవ‌ర్సీస్ ప‌రంగా చూస్తే ..ఇత‌ర దేశాల‌కు వెళ్లాలని అనుకునే వారికి 3 వేల 499 రూపాయ‌లుగా నిర్ణ‌యించింది. 10 ల‌క్ష‌ల టికెట్ల‌ను ఈ బంప‌ర్ ఆఫ‌ర్ కింద ఇవ్వ‌నుంది.

ఆయా సిటీల మ‌ధ్య టికెట్ల ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి. ఇండిగో ఆఫ‌ర్ చేసిన ప్యాకేజీల ప‌రంగా చూస్తే..ఢిల్లీ నుంచి అహ్మ‌దాబాద్ కు వెళ్లాల‌నుకునే వారు 1799 రూపాయ‌లుగా నిర్ణ‌యించింది. ఢిల్లీ నుంచి బెంగ‌ళూరుకు 3 వేల 299 రూపాయ‌లు, ఢిల్లీ నుంచి ఛండీగ‌ఢ్ కు 1299 రూపాయ‌లు, ఢిల్లీ నుంచి జైపూర్‌ల మ‌ధ్య వెళ్లే వారికి 1499 రూపాయ‌లు, గోవా నుండి హైద‌రాబాద్‌కు 1499 రూపాయ‌లు, హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు మ‌ధ్య 1899 రూపాయ‌లు, ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు 1999 రూపాయ‌ల టికెట్ల ధ‌ర‌లు నిర్ణ‌యించింది.

ఇక అంత‌ర్జాతీయ ప‌రంగా ప్ర‌యాణించే వారి కోసం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ఢిల్లీ నుంచి అబుదాబికి 6 వేల 799 రూపాయ‌లు, బెంగ‌ళూరు నుంచి బ్యాంకాక్ కు 6 వేల 899 రూపాయ‌లు, కోల్‌క‌తా నుండి బ్యాంకాక్ కు 5 వేల 99 రూపాయ‌లు, హైద‌రాబాద్ నుంచి దుబాయికి 8 వేల 999 రూపాయ‌లు, ఢిల్లీ నుంచి దుబాయికి 7 వేల 999 రూపాయ‌లు, ఢిల్లీ నుంచి కౌలాలంపూర్ కు 6 వేల 599 రూపాయ‌లుగా సంస్థ పేర్కొంది. ఇంకో వైపు ఇండ‌స్‌లాండ్ బ్యాంకు ద్వారా ఖాతాదారులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు సంస్థ తెలిపింది. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా అయితే 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్న‌ట్లు పేర్కొంది. అయితే మినిమం 6000 రూపాయ‌ల ట్రాన్సాక్ష‌న్ జ‌రిగి ఉండాల‌న్నారు. సో ఇంకెందుకు ఆల‌స్యం..విహంగ‌పు క‌ల‌ల బేహారుల‌కు ఇంత కంటే మంచి త‌రుణం దొర‌క‌దు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!