ధన ప్రవాహం - దొరబాబులదే రాజ్యం - కార్పొరేట్ కంపెనీలదే ఆధిపత్యం

ఇండియాలో ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. మీడియా, మనీ , పీపుల్స్ మేనేజ్‌మెంట్ ఆపరేటింగ్ సిస్టం అనే ప్రక్రియ కొత్తగా మొదలైంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో సగటున 75 కోట్ల నుండి 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కొలువుతీరిన ప్రజాప్రతినిధులు తమను తాము దైవాంశ సంభూతులుగా ఊహించుకుంటున్నారు. రెడ్ లైట్, బుగ్గ కారు, సెక్యూరిటీ, లెక్కనేంత నిధులు, ఆశించిన దానికంటే ఎక్కువ వసతులు ఇంకేం దోచుకున్నోడికి దోచుకున్నంత. ఇదీ భారతీయ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎలక్షన్స్ అంటేనే మనీతో మేటర్ సెటిల్ మెంట్ చేసుకోవడం. గెలుపొందాక తిరిగి పిండు కోవడం. ఇది మామూలై పోయింది. టికెట్ తెచ్చుకోవడం దగ్గరి నుండి ఎన్నికలై పోయేంత వరకు మనీతోనో పని. గతంలో అభ్యర్థులు ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. పోస్టర్లు, క్యాంపెయిన్లు, మీడియా మేనేజ్‌మెంట్, ప్రెస్ మీట్స్, డిజిటల్, సోషల్ మీడియాను వాడుకోవడం ..సాధ్యమైనంత మేరకు పబ్లిసిటీ వచ్చేలా చూసుకోవడం. గెలిచాక డోంట్ కేర్ అంటూ వెళ్లిపోవడం. మళ్లీ కనిపిస్తే ఒట్టు..ఐదేళ్లక...