మోస్ట్ బిలీవబుల్ బ్రాండ్ అమెజాన్
ప్రపంచ వ్యాప్తంగా ఈకామర్స్ బిజినెస్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ అమెజాన్ మోస్ట్ డిజైరబుల్, నమ్మకమైన బ్రాండ్‌గా భారత్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆర్ీబీఆర్ సంస్థ ప్రత్యేకంగా సర్వే నిర్వహించింది. రెండు, మూడు స్థానాల్లో మైక్రోసాఫ్ట్ ఇండియా, సోని ఇండియా కంపెనీలు నిలిచాయని వెల్లడించింది. రాండ్ స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2019లో ఫైనాన్షియల్ హెల్త్, లేటెస్ట్ టెక్నాలజీల వాడకం, మంచి కీర్తి ప్రతిష్టలున్న కంపెనీగా అమెజాన్ అత్యధిక స్కోర్‌ను సంపాదించుకుంది. సత్యనాదేళ్ల సిఇఓగా వున్న మైక్రోసాఫ్ట్ ఇండియా రన్నర్ అప్ గా నిలిచింది.
సోనీ కంపెనీకి ఇండియా, ఆసియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్రాండ్ వాల్యూను స్వంతం చేసుకుంది. టెక్నాలజీ, గృహోపకరణాలతో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో తనదైన పాత్ర నిర్వహిస్తోంది. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ 4వ స్థానం సాధించగా, ఐటీ బేస్డ్ ఐబీఎం 5వ స్థానంలో ఉండగా కన్‌స్ట్రక్షన్ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న ఎల్ అండ్ టీ 6వ స్థానం పొందింది. నెస్లే కంపెనీ 7వ స్థానం , ఇన్ఫోసిస్ కంపెనీ 8వ స్థానంలో ఉండగా సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక 10వ స్థానంలో ఐటీ అండ్ యాక్ససరీస్ కంపెనీ డెల్ కంపెనీ 10వ స్థానంలో నిలిచాయి.
రాండ్ స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ గ్లోబల్ ఎకానమీలో 75 శాతాన్ని కవర్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా రెస్పాండెంట్లతో 32 దేశాలు దీని రీసెర్చ్‌లో పాల్గొన్నాయి. బ్రాండ్ వాల్యూను గుర్తించే క్రమంలో భారతీయ ఉద్యోగులు ఎంప్లాయర్‌ను ఎంపిక చేసుకునే ముందు వేతనాలు, ఉద్యోగుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటున్నారని, ఆ తర్వాత వర్క్ - లైఫ్ బ్యాలెన్స్‌ను , జాబ్ సెక్యూరిటీని చూస్తున్నారని ఆర్ఏబిఆర్ సంస్థ వెల్లడించింది.
మెజారిటీ ఇండియన్లు అంటే దాదాపు 55 శాతానికి పైగా జనం బహుళ జాతీయ కంపెనీల్లో పని చేసేందుకే మొగ్గు చూపిస్తున్నారని తెలిపింది. ఈకామర్స్, ఐటీ , అగ్రి, డిజిటల్ టెక్నాలజీ, ఎంటర్ టైన్ మెంట్ , తదితర రంగాల్లో పని చేసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. ఇందులో కేవలం 9 శాతం మంది మాత్రం స్టార్టప్‌ల వైపునకు వెళుతున్నారని తెలిపింది. ఎంఎన్‌సీలు తమ సంస్థల్లో జాబ్ సెక్యూరిటీని, ఫైనాన్షియల్ హెల్త్‌ను , కెరీర్‌ను పెంచుకునే అవకాశాలను ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్నాయని వెల్లడించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి