మొబైల్ మార్కెట్లో మనోడే దిగ్గజం

ప్రపంచ వ్యాపార రంగంలో భారతీయులు టాప్ పొజిషన్ లో వుంటున్నారు . ఇప్పటికే మొబైల్ తయారీ మార్కెట్ లో చైనా అందనంత దూరంలో ఉన్నది . ఇతర దేశాలకు దిమ్మ తిరిగేలా షాక్ లు ఇస్తూ కోలుకోలేకుండా చేస్తోంది . ఓ వైపు ఆపిల్ ఇంకో వైపు సాంసంగ్ మొబైల్స్ కు పోటీగా చైనా మొబైల్స్ ఇండియన్ మార్కెట్ ను ఆక్రమించేశాయి . దీంతో చైనాను నిలువరించేందుకు భారతీయ స్మార్ట్ ఫోన్ల తయారీదారులు నానా తంటాలు పడుతున్నారు . మైక్రో మాక్స్ , ఇంటెక్స్ ..తదితర కంపెనీలు మార్కెట్లో ఉన్నా ఆశించినంత అమ్మకాలు సాగడం లేదు . చైనా మొబైల్స్ కంపెనీలలో వివో ..ఒప్పో తో పాటు రెడ్ మీ స్మార్ట్ ఫోన్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. తయారీలోనూ ..సెల్ఫీ క్లారిటీ ,,బ్యాటరీ ..ఎక్కువ ఫీచర్స్ ..ఉండడంతో ఈ మొబైల్స్ ను యూత్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు . దీంతో ఊహించని రీతిలో చైనా మొబైల్స్ కంపెనీలకు లెక్కించంలేనంత ఆదాయాం సమకూరుతోంది . ఓ వైపు వివో కంపెనీ ఏకంగా అత్యంత ఖరీదైన టోర్నమెంట్ ఐపిల్ టోర్నీని స్పాన్సర్ చేస్తోంది . దీనిపైనే ఏకంగా ఈ కంపెనీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. భారతీయ వ్యాపార రంగంలో తమ వాటాను కలిగి ఉన్న విదేశీ కంపెనీలకు కోలు...