రాజస్థాన్ రాయల్ విక్టరీ - బట్లర్ భారీ స్కోర్

ఐపీఎల్ టోర్నమెంట్ లో రాజస్థాన్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది . స్వంత గడ్డపై ముంబై వాంఖేడ్ మైదానంలో ఫాన్స్ మద్దతు ఉన్న ముంబై జట్టును రాజస్థాన్ ఓడించింది . ఆరు వికెట్లను కోల్పోయి 188 పరుగుల టార్గెట్ ను ఈజీగా ఛేదించింది . మొదట రహానే ఆరు ఫోర్లు ఒక సిక్స్ తో 37 పరుగులు చేయగా ..జొస్ బట్లర్ చెలరేగి ఆడాడు . రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు . ఏకంగా కేవలం 43 బంతులు మాత్రమే ఆడిన బట్లర్ ఎనిమిది ఫోర్లు ..ఏడు సిక్సర్లతో 89 పరుగులు చేశాడు . వీరిద్దరూ మంచి శుభారంభం అందించారు .

మైదానంలో బట్లర్ చెలరేగి ఆడుతూ ఉంటే ముంబై బౌలర్లు ఏమీ చేయలేక చతికిల పడ్డారు . ఆ తర్వాత వచ్చిన ఇండియన్ స్టార్ క్రికెటర్ సంజూ సాంసన్ 31 పరుగులు చేయడంతో సునాయాసంగా విజయం లభించింది. శాంసన్ అవుట్ కావడం ..త్వరత్వరగా రాజస్థాన్ వికెట్లు కోల్పోవడంతో గెలుస్తుందో లేదోనన్న ఉత్కంఠ నెలకొన్నది . ఈ సమయంలో రంగంలోకి దిగిన చివర్లో శ్రేయాస్‌ గోపాల్‌(13) ధాటిగా ఆడి ముంబయిని ఓడించాడు. ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు .

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ 32 బంతుల్లో 47 పరుగులు చేస్తే .. డికాక్ 52 బంతులు ఆడి 81 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు . మొదటి నుంచీ దూకుడుగా ఆడి ఆ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి వీరిద్దరూ 96 పరుగులు జోడించాక రోహిత్‌ ఔటయ్యాడు. అనంతరం క్వింటన్‌ అర్ధశతకంతో చెలరేగి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో సూర్యకుమార్‌ , కీరన్‌పొలార్డ్‌ తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరడంతో డికాక్‌, హార్దిక్‌ పాండ్య నిలకడగా రాణించారు. చివర్లో డికాక్‌, ఇషాన్‌ కిషన్‌ వెనువెంటనే ఔటైనా హార్దిక్ పాండ్య 28 పరుగులు చేయడంతో రాజస్థాన్‌ ముందు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు. అయినా ముంబై రాజస్థాన్ జట్టును కట్టడి చేయలేక పోయింది . దీంతో రాజస్థాన్ భారీ టార్గెట్ ను ఛేదించి విజయాన్ని నమోదు చేసుకుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!