హమ్మయ్య ..గెలిచారు ..నిలిచారు..!
ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎట్టకేలకు ఇండియన్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగుళూరు చాలెంజర్స్ జట్టు బోణీ చేసింది . పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది . ఏకంగా ఆరు మ్యాచుల్లో ఓటమి పాలై క్రికెట్ ఫాన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కున్న కోహ్లీ సేన సునాయాసంగా గెలుపు సాధించింది . కెప్టెన్ కోహ్లీ తో పాటు డివిలియర్స్ అద్భుత ప్రదర్శన ప్రదర్శించారు . అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అత్యుత్తమమైన పనితీరు కనబరిచారు . వరుస ఓటములతో డీలా పడిన కోహ్లీ జట్టు మెరుగైన ఆట ఆడింది . మిగతా జట్లన్నీ గెలుస్తూ పాయింట్ల పట్టికలో ముందు వరుసలో చేరిపోతుంటే కోహ్లీ ఒక్కడే ఒంటరిగా మిగిలి పోయాడు . ఐపీఎల్ లో విజయం కోసం నానా తంటాలు పడ్డాడు . ఎటు చూకిస్నా విమర్శలే . కోహ్లీని తప్పించాలని క్రికెట్ ఫాన్స్ డిమాండ్ చేశారు .
ఐపీఎల్ లో జట్టును గెలిపించలేని కెప్టెన్ ఇక ఇండియా జట్టును గెలిపిస్తాడని ..తక్షణమే మార్చాలంటూ నెటిజన్లు .. అభిమానులు డిమాండ్ చేశారు . దీంతో కోహ్లీ ఆట మైదానంలో తీవ్ర అసహనానికి గురయ్యాడు . ఎట్టకేలకు విజయం సాధించడంతో కోహ్లీ మోములో నవ్వు మెరిసింది . ఇక ఆట విషయానికి వస్తే .. చండీగఢ్ లో జరిగిన మ్యాచ్ లో 53 బంతుల్లో 67 పరుగులు కోహ్లీ చేస్తే ..డివిలియర్స్ 38 బంతుల్లో 59 పరుగులు చేయడంతో గెలుపు సాధ్యమైంది . మరో వైపు పంజాబ్ జట్టులో కీలక ఆటగాడిగా పేరున్న క్రిస్ గేల్ కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు . చివరి వరకు నాటౌట్ గా మిగిలాడు . కేవలం 64 బంతులు మాత్రమే ఆడిన గేల్ బెంగళూర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు . 10 ఫోర్లు .. 5 భారీ సిక్సర్లు బాదడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది . నాలుగు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది పంజాబ్ జట్టు .
ఇక అతడు ఒక్కడే అనుకోవాలి . కోహ్లీ ..డివిలియర్స్ గొప్పగా ఆడినా గేల్ ఆట తీరు ముందు వారి ఆట వెలవెల బోయింది . గేల్ తన భిన్నమైన ఆట తీరుకు భిన్నంగా ఈ మ్యాచ్ లో ఆడటం విశేషం . సిరాజ్ వేసిన ఆరో ఓవర్లో చుక్కలు చూపించాడు గేల్ . ఈ ఒక్క ఓవర్ లోనే గేల్ 24 పరుగులు చేశాడు . చాహల్ ..ఆలీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గేల్ కొంచం ఇబ్బంది పడ్డాడు . మొత్తం మీద గేల్ చేసిన పరుగులే పంజాబ్ ఆ మాత్రం స్కోర్ చేసింది . అనుకోని విజయం సాధించడంతో కోహ్లీ సేన ఊపిరి పీల్చుకుంది . విజయం కోసం మొహం వాచిపోయిన కోహ్లీ మోములో సంతోషం కనిపించింది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి