తెలంగాణకే తలమానికం..బతుకమ్మ సంబురం..!

ఎనలేని దోపిడీకి, తరతరాల వివక్ష నుండి విముక్తం పొందిన తెలంగాణ మాగాణం ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని నిటారుగా నిలబడ్డది. ఒకే గొంతుకై ఆడుతున్నది, పాడుతున్నది. కోట్లాది గొంతుకలు ఇప్పుడు బతుకంతా సంబురాలను జరుపుకునే అరుదైన సన్నివేశం బతుకమ్మ పండుగ కు ముస్తాబవుతోంది. పూల జాతరను తలపించేలా లక్షలాది ఆడబిడ్డలు యుద్దానికి సిద్ధమవుతున్నారు. బతుకమ్మ అన్నది కొందరికి మాత్రం అదో పండుగగా భావిస్తారు. కానీ అదో మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక. ఇక బతుకమ్మ విషయానికి వస్తే, ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మను తెలంగాణాలో సద్దుల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ బతుకమ్మ దసరా పండుగకు రెండు రోజుల ముందు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించింది. సెప్టెంబరు, అక్టోబరు నెలలలో రెండు పెద్ద పండుగలు జరుగుతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటు వైపు, ఇటు వైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయికలతో నిండి పోతుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా మరొకటి విజయ దశమి పండుగ. అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్ర...