ఇమ్రాన్ ఖాన్ కు అమెరికా ఝలక్
ఇప్పటికే ప్రపంచ వేదికపై ఒంటరిగా మిగిలి పోయిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు గట్టి దెబ్బ తగిలింది. పనిగట్టుకుని కాశ్మీర్ అంశంపైనే ఎక్కువగా ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సభలో ఫోకస్ చేసిన ఇమ్రాన్ కు చురకలు అంటించింది అగ్రరాజ్యం అమెరికా. ఇదే అంశం గురించి మీరు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు, ప్రతి చోటా ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. కానీ ముందు మీ పాకిస్తాన్ లో పాతుకు పోయిన ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని రూపు మాపేందుకు చర్యలు చేపట్టాలని అమెరికా సూచించింది. భారత్‌తో శాంతి చర్చలు కోరుకుంటున్న విషయం వాస్త వమే, అయితే అందుకు తగ్గట్టుగా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 74వ సెషన్‌లో భాగంగా అమెరికా దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ కార్యదర్శి అలైస్ వెల్స్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కశ్మీర్ విషయంలో దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ లు సామరస్య పూర్వకంగా చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అణ్వాయుధాలు ఇరు దేశాలు కలిగి ఉన్నాయని, ప్రస్తుతం చర్చల ద్వారానే సమస్యకు ముగింపు పలికితే బాగుంటుంని ఆమె హితవు పలికారు. జమ్మూ , కశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని కోరబోమని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక పాకిస్తాన్ మాత్రం కశ్మీర్ అంశంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే పాకిస్తాన్ తొలుత ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఐక్యరాజ్యసమితిచే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రపడిన హఫీజ్ సయీద్, జైషే ఛీప్ మసూద్ లకు ఆశ్రయం ఇవ్వడం నిలుపుదల చేయాలన్నారు.
అదే విధంగా కశ్మీర్‌లోని ముస్లింల విషయంలో ఒకలా, చైనాలోని ముస్లింల విషయంలో మరోలా వ్యవహరించడం ఏమిటని ఆమె పాకిస్తాన్‌ను ప్రశ్నించారు. ‘కశ్మీర్ కంటే చైనాలోని ముస్లింలే నిర్భంధంలో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అలైస్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇండియా పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను, ఆగడాలను విశ్వ వేదికపై బయట పెట్టింది. అంతే కాకుండా భారత సరిహద్దులో దాయాది దేశం చేస్తున్న దాడులకు సంబంధించిన ఆధారాలను, క్లిప్పింగ్స్ ను భారత శాశ్వత ప్రతినిధి వెల్లడించారు. దీంతో నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన పాకిస్థాన్ మౌనంగా చూస్తూ వుండి పోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఏకాకిగా మిగిలి పోయింది. ఒక్క చైనా తప్ప ఏ ఒక్క దేశమూ దాయాది దేశానికి మద్దతు ఇవ్వక పోవడం గమనార్హం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి