అంచనాలు పెంచుతున్న అల వైకుంఠపురంలో..!
మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న అల వైకుంఠపురంలో..సినిమా విడుదల కాకుండానే హీటెక్కిస్తోంది. ఇప్పటికే మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ గా త్రివిక్రం కు పేరుంది. టేకింగ్, స్క్రీన్ ప్లే , మ్యూజిక్, సాహిత్యం, కథ, పాత్రల ఎంపిక, డైలాగ్స్..ఇలా సినిమాకు కావాల్సిన వన్నీ జనానికి వండి వడ్డించడంలో ఆయనను మించిన దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేరంటే అతిశయోక్తి కాదేమో. మొదట మాటల రచయితగా ప్రారంభమైన ప్రస్థానం కోట్లాది రూపాయలు వసూళ్లు చేసే సక్సెస్ ఫుల్ సినిమాలు తీసే దమ్మున్న దర్శకుడిగా త్రివిక్రం తనను తాను నిరూపించుకున్నాడు. కేవలం ఆయన తాను రాసే మాటల కోసం వేలాది మంది అభిమానులు, లెక్కకు మించి మహిళలు వేచి చూడటం మామూలే. ఈ సినీవాకిట ఓ రచయితకు గౌరవాన్ని, గుర్తింపును, ఓ స్టార్ ఇమేజ్ ను తీసుకు వచ్చిన ఘనత త్రివిక్రం కే చెల్లింది.
త్రివిక్రంలో రైటర్ కాదు భావుకుడు, కవి, మెంటార్, ట్రైనర్, అధ్యాపకుడు, పంతులు, సినీ ప్రేమికుడు, సామాజిక బాధ్యత కలిగిన పౌరుడు ఉన్నాడు. అందుకే అతడు ఓ సంచలనం. అతడు , అత్తారింటికి దారేది ఓ ప్రభంజనం. డైరెక్టర్ అన్నాక సక్సెస్.. తో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. కానీ పడి పోయిన ప్రతిసారి బంతిలా తిరిగి పైకి లేచే కరేజ్ కలిగిన డైరెక్టర్ ఆయన ఒక్కడే. ఎక్కువ సోది లేకుండా బుల్లెట్లలా గుండెల్లో దూసుకు వెళ్లే ..ఆయన రాసే మాటలు కోట్లు కురిపించేలా చేస్తున్నాయి. బన్నీతో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు తీసి సక్సెస్ చేశాడు. పవన్ తో తీసిన అజ్ఞాతవాసి ఆడలేదు. జూనియర్ ఎన్ఠీఆర్ తో తీసిన అరవింద సామెత సినిమా డివైడ్ టాక్ వచ్చినా, భారీ వసూళ్లు రాబట్టింది. మరో వైపు బన్నీ కి ఇప్పుడు త్రివిక్రంతో తీస్తున్న అల వైకుంఠపరువంలో సినిమా అతి ముఖ్యమైనది.
ఇప్పుడు వీరిద్దరికీ ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్ గా నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సినిమాను బన్నీ ఫాదర్ అల్లు అరవింద్ తో పాటు ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. బన్నీతో పాటు పూజా హెగ్డే , నవదీప్, టబు, జయరాం సినిమాలో నటిస్తుండగా థమన్ మరోసారి త్రివిక్రం సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. గీత ఆర్ట్స్ , హారిక అండ్ హారిక క్రియేషన్స్ సమర్పిస్తున్నారు. సినిమా చాలా వరకు పూర్తి దశలో ఉందని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి బిజినెస్ కూడా ఒకే అయినట్టు సినీవర్గాల భోగట్టా. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీలో కూడా ప్లాన్ చేస్తోంది టీమ్. డిజిటల్ సాటిలైట్ హక్కులను జెమిని టీవీ చేజిక్కించుకుంది. ఇప్పటికే టీజర్ తో సాంగ్ ను కూడా విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం మీద అల వైకుంఠపురంలో సినిమా ఎనర్జటిక్ స్టార్ బన్నీ బాబుకు , డైలాగ్ కింగ్ మేకర్ త్రివిక్రం కు అగ్నిపరీక్ష లాంటిది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి