తీరు మారని పాకిస్తాన్..రెచ్చి పోయిన ఇమ్రాన్ ఖాన్

కుక్క తోక వంకర అన్నట్లు దాయాది పాకిస్థాన్ తన తీరును మార్చుకోలేదు. ఐక్య రాజ్య సమితి వేదికపై ఇండియా, పాకిస్తాన్ దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర దామోదర దాస్ మోదీ, ఇమ్రాన్ ఖాన్ లు ప్రసంగించారు. మోదీ మాహాత్మా గాంధీని ఉటంకిస్తూ ప్రపంచానికి శాంతి కావాలని, ఉగ్రవాదం, తీవ్రవాదం మానవజాతికి అత్యంత ప్రమాదకరంగా మారిందని అన్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు, ప్రతి దేశమూ ఉగ్ర మూకల నుండి ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి, కానీ ముస్లిం సమాజంలో ఏ మాత్రం మార్పు రాలేదు. వాళ్ళు ఎప్పటిలాగే ఉన్నారు. జిహాద్ పేరుతో యుద్ధం చేస్తున్నారు. ఎక్కడ చూసినా అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. దాయాది పాకిస్తాన్ ఇండియాలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతి నిమిషం పావులు కదుపుతోందని ధ్వజమెత్తారు.

ప్రపంచం శాంతిని కోరుకుంటోంది..కానీ మారణ హోమాన్ని కాదన్నారు. శాంతి కోసం, మానవజాతి సంక్షేమం కోసం పాటుపడాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అస్థిరపరిచే శక్తులను చూస్తూ ఊరుకోబోమన్నారు. మోదీ ప్రసంగించిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. మొత్తం మాట్లాడిన దాంట్లో ఎక్కువగా ఇండియాపై, మోదీజీపై దూషణకు దిగారు. తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంకాస్తా ముందుకు వెళ్లి ఇక యుద్ధానికి రెడీ అంటూ విశ్వవేదికపై ప్రకటన చేశారు. అయన మాట్లాడిన మాటల్లో ఏదీ నిజం కాకపోగా, మొత్తంగా ఆయనలో ఎక్కువగా ఆందోళన కనిపించింది. అవసరమైతే అణ్వస్త్రాలను ప్రయోగిస్తామని, దీనిని నిలపాల్సిన బాధ్యత యునైటెడ్ నేషన్స్ పై ఉందన్నారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతమే జరుగుతుందన్నారు. యుద్ధం అనేది వస్తే ఏమైనా జరగొచ్చు అని ఇండియాను పరోక్షంగా హెచ్చరించారు.

ఆరెస్సెస్‌కు హిట్లర్‌, ముస్సోలినే స్ఫూర్తి అని ఇమ్రాన్ ధ్వజమెత్తారు. వేలాది మంది ముస్లిం లను ఊచకోత కోశారని, ఏ ఒక్క దేశమూ ఖండించలేదన్నారు. ఉన్నది ఒకటే ఇస్లాం. రాడికల్‌ ఇస్లాం అంటూ ఏదీ లేదని చెప్పారు. ఏ మతమూ తీవ్రవాదాన్ని బోధించదని, అన్ని మతాల్లోనూ తీవ్రవాద చర్యలకు పాల్పడే వ్యక్తులు తప్పక ఉంటారని స్పష్టం చేశారు. 9/11 కు ముందు ప్రపంచంలో మెజారిటీ ఆత్మాహుతి దాడులు జరిపింది తమిళ టైగర్లే.. అంటే హిందువులే. కానీ, ఎవరూ హిందూయిజంపై ఆరోపణలు చేయలేదన్నారు. 20 ఏళ్ల కశ్మీరీ యువకుడు భారత సైనిక కాన్వాయ్‌ వెళ్తుండగా తనను తాను పేల్చేసుకున్నాడు. దానికి భారత్‌ మమ్మల్ని నిందిస్తే ఎలా అని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు. మీవద్ద ఏ చిన్న ఆధారం ఉన్నా మాకు పంపండి అని మేం మోదీకి చెప్పామని, కానీ దానికి ప్రతిగా వారు మాపై బాంబులు వేశారని ఇదెక్కడి న్యాయమన్నారు.

కశ్మీర్‌ విషయంలో ఇండియా అన్ని చట్టాలనూ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. తాను ఈ సమావేశానికి రావడానికి గల ముఖ్యమైన కారణం కశ్మీర్‌ అంశమేనని చెప్పారు. కశ్మీర్‌ లోయలో విధించిన అమానవీయ కర్ఫ్యూను భారత్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. నాకు భారత్‌లో అనేక మంది స్నేహితులున్నారు. ఇండియాకు వెళ్లడమంటే చాలా ఇష్టం. అందుకే మేం అధికారంలోకి రాగానే భారత్‌కు స్నేహహస్తం చాచాం అని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. వాణిజ్యం ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకుందామని కోరాం కానీ మోదీ ఒప్పుకోలేదన్నారు. మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ ఇండియాతో యుద్ధం చేసేందుకు సై అంటున్నారు. మోదీ మాత్రం నవ్వుతూ నే ఉన్నారు. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇండియన్స్ ఆందోళన చెందుతున్నారు.

కామెంట్‌లు