ఆందోళనలు..అసంతృప్తులు

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ అసంతృప్తులను ఆగ్రహానికి గురి చేస్తోంది. మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలో మంత్రలుగా అవకాశం లభిస్తుందనుకున్న పలువురు సీనియర్లకు మొండి చేయి ఎదురైంది. మంత్రివర్గ విస్తరణ జరిగి నాలుగు రోజులైన తరువాత అసంతృప్తులు ఒక్కొకరూ బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణతీ షిండేకు స్థానం కల్పించక పోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె మద్దతుదారులు షోలాపూర్ కాంగ్రెస్ భవనం ఎదుట ధర్నా, ఆందోళన నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ రీజియన్‌లకు చెందిన పదాధికారులు పాల్గొన్నారు. సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతీ షిండే షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. దీంతో కేబినెట్‌లో చోటు దక్కడం ఖాయమని ఆమె భావించారు. ఈ మేరకు మద్దతుదారులకూ భరోసా ఇచ్చారు. మహా వికాస్ ఆఘాడి మంత్రి వర్గ విస్తరణలో తనను చిన్న చూపు చూశారని, ఇప్పటికైనా నాయకులు మనసు మార్చుకుని స్థానం కల్పించాలని ఆ...