కస్టమర్స్ కోసం కొత్త ప్లాన్

టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ వినియోగదారులకు వరంగా మారుతోంది. ఇప్పటికే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొట్టిన దెబ్బకు ఠారెత్తాయి. ఇదే క్రమంలో భారత అత్యున్నత న్యాయ స్థానం కోలుకోలేని షాక్ ఇచ్చింది. లక్షన్నర కోట్లకు పైగా చెల్లించాలంటూ సంచలన తీర్పు చెప్పింది. ఈ మొత్తం డబ్బులను మూడు నెలల లోపు క్లోజ్ చేయాలనీ ఆదేశించింది. దీంతో వోడాఫోన్, జియో, ఎయిర్ టెల్ కంపెనీలు పెద్ద ఎత్తున బాకీ పడ్డాయి. ఇప్పటికే టెలికం సెక్టార్ లో టాప్ రేంజ్ లో ఉన్న ఎయిర్ టెల్ కు జీవిత కాలం గుర్తు పెట్టుకునేలా దెబ్బ కొట్టింది రిలయన్స్ గ్రూప్ కంపెనీ. అపరిమితమైన డేటా, టారిఫ్ ప్లాన్స్ టెలికం కస్టమర్స్ కు అనుగుణంగా ఉండేలా చేసింది.

ఇతర టెలికాం కంపెనీల నుండి వినియోగదారులు ఒకే ఒక్క రోజులు రిలయన్స్ జియో కు మారారు. దేశ వ్యాప్తంగా ఫైబర్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు జియోకు ఏకంగా 35 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు. ఇది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన కంపెనీగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఇతర కంపెనీలన్నీ దివాళా అంచున నిలబడ్డాయి. ఇంకో వైపు భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ దిద్దుబాటు చర్యలకు దిగింది. తమ వినియోగదారులకు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. 279, 379 రీచార్జ్‌తో రెండు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను తమ వెబ్‌ సైట్‌లో వెల్లడించింది.

ఈ రీఛార్జ్‌లో ఆన్‌ లిమిటెడ్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. వీటికి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తోపాటు నాలుగు లక్షల జీవిత బీమాను ఇస్తోంది. ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ 279 రిఛార్జ్‌ చేసుకుంటే రోజూ 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్యాక్‌ గడువు 28 రోజులని తెలిపింది. అలాగే 379 రీచార్జ్‌ చేసుకుంటే అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌, కేవలం 6 జీబీ డేటా, 900 ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే పొందడానికి వీలు ఉంటుంది. ఈ ప్లాన్‌ గడువు 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌తోపాటు ఇతర అన్ని నెట్‌వర్క్‌లకు వర్తిస్తుంది. 379 రీచార్జ్‌ ఫాస్టాగ్‌ కొనుగోలుపై 100 క్యాష్‌ బ్యాక్‌ను కస్టమర్లకు అందిస్తోంది.

వీటితో పాటు వింక్‌ మ్యూజిక్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇటీవలే ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు భారీగా కోత విధించగా..తాజాగా రెండు కొత్త ప్లాన్లను ప్రకటించి యూజర్లకు కొంత ఊరట నిచ్చింది. ఇటీవల అన్ని టెలికాం సంస్థలు ప్రీపెయిడ్‌ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. తమ కంపెనీ నష్టాలను పూడ్చేందుకే ఈ ధరలను పెంచుతున్నట్లు సదరు టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. ఇక కొత్త ఎయిర్‌టెల్‌ ప్లాన్‌.. జియో, వొడాఫోన్ ఆఫర్‌లతో పోల్చితే మెరుగ్గానే ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!