మౌలిక రంగానికే ప్రయారిటీ

కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ మేరకు అన్ని రంగాలకు ఊతం ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్ధిక రంగం పూర్తిగా కునారిల్లి పోయింది. ఈ మేరకు ఆర్తి వెసలుబాటు, తోడ్పాటు కల్పించేందుకు గాను బృహత్తర ప్రణాలికను విత్త మంత్రి విడుదల చేశారు. మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో 102 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ముంబై, అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో మౌలిక రంగంలో100 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ప్రకటించిన విషయాన్ని నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు.

ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కేవలం నాలుగు నెలల్లోనే 70 భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించి 102 లక్షల కోట్ల ప్రాజెక్టులను విద్యుత్, రైల్వేస్, అర్బన్‌ ఇరిగేషన్, మొబిలిటీ, విద్య, ఆరోగ్య రంగాల్లో గుర్తించినట్టు చెప్పారు. మరో 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు కూడా వీటికి తోడవుతాయన్నారు. గత ఆరేళ్లలో కేంద్రం, రాష్ట్రాలు మౌలిక రంగంపై చేసిన 51 లక్షల కోట్లకు ఇది అదనమని పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టుల్లో కేంద్రం, రాష్ట్రాల నుంచి చెరో 39 శాతం, ప్రైవేటు రంగం నుంచి 22 శాతం ఉంటాయన్నారు. ఇంధన రంగంలో 25 లక్షల కోట్ల ప్రాజెక్టులు రానున్నాయని, రోడ్ల నిర్మాణంలో 20 లక్షల కోట్లు, 14 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రానున్నట్టు మంత్రి  వివరించారు.

2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం గుర్తించిన ప్రాజెక్టుల్లో ఇంధనం, రోడ్లు, రైల్వే రంగాలకు అగ్ర ప్రాధాన్యం లభించింది. జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్‌ కింద గుర్తించిన ప్రాజెక్టుల్లో 42.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. 32.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు తయారీ దశలో, 19.1 లక్షల కోట్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇవి 22 శాఖలు, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అమలవుతాయి  అని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!