ఆర్ధిక ఇబ్బందుల్లో అవసరమా
ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. ఈ సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమున్నది. కొత్త సచివాలయం ఇప్పుడే నిర్మించాలనే నిర్ణయం తాత్కాలికంగా విరమించుకుంటే కొంత మేరకైనా ప్రజాధనం మిగిల్చిన వాళ్లవుతారు. జనహితం అంటున్నారు. నూతన కట్టడం వల్ల కొన్నేళ్లు పడుతుంది. దీనిపై ఖర్చు పెట్టడంతో ఏమైనా ఆదాయం సమకూరుతుందా, అంటే అదీ లేదు. ఇలాంటప్పుడు ఇప్పటికిప్పుడు కట్టడాన్ని వాయిదా వేస్తేనే బాగుంటుందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నగరంలోని వేర్వేరు చోట్లకు సచివాలయ కార్యాలయాన్ని తరలిస్తే, అధికారిక రహస్య ఫైళ్ల పరిస్థితి ఏమిటి. ఆ ఫైళ్లు తరలించే దారిలో అవి కనిపించకుండా పోతే, ఆ ఫైళ్లు తారుమారయ్యే అవకాశం లేదా. వేర్వేరు చోట్ల సచివాలయ కార్యాలయాలు ఉంటే కీలక ఫైళ్లకు కాళ్లు వస్తే పరిస్థితి ఏమిటి అని ధర్మాసనం ప్రశ్నలు సంధించింది.
ఇదే అంశంపై మంత్రివర్గం 2019 ఫిబ్రవరి 18న తీసుకున్న నిర్ణయం చూస్తే అంతా గందర గోళంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి తగినట్లుగా అన్ని హంగులతో భావి తరాలకు సరిపడేలా ఉన్నత స్థాయి నిర్మాణం చేయడమే కొత్త సచివాలయ ఉద్దేశం అని ఒక చోట ఉంది. పాత సచివాలయానికే మార్పులు చేర్పులు చేసి ఆధునీకరించి వినియోగించు కోవాలని మరో చోట ఉంది. పరస్పర విరుద్ధంగా అంతా అయోమయంగా కేబినెట్ నిర్ణయం ఉంది. ఇంతకీ ఆ ద్వంద్వ నిర్ణయాలేమిటో, వాటి ఆచరణలో అమలయ్యేదేమిటో చెప్పాలి..? అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. సచివాలయాన్ని కూల్చి కొత్తగా నిర్మాణం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం.. పలు ప్రశ్నలతో ఉక్కిబిక్కిరి చేసింది.
ఎంత కాలంలో కొత్త సచివాలయాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సత్వరమే నిర్మాణం చేయాలనుకున్నా కనీసం మూడేళ్లు పడుతుందని, అప్పటివరకూ వేర్వేరు చోట్ల ఉన్న ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదిస్తూ మంత్రివర్గం నిర్ణయం తర్వాత మంత్రివర్గ ఉప సంఘం కూడా ఏర్పాటైందని, ఈ అంశంపై అధ్యయనానికి ఆ సంఘం సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిన కారణంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని సచివాలయ భవనాల్ని కూల్చరాదని మాత్రమే తాము స్టే ఉత్తర్వులు జారీ చేశామని, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అంశాలపై కాదని తేల్చి చెప్పింది. సచివాలయాన్ని 70 శాతం వరకూ బూర్గుల భవనంలోకి, మిగిలిన 30 శాతాన్ని నగరంలోని వేరు వేరు ప్రభుత్వ భవనాల్లోకి తరలించామని తెలిపారు.
చాలా వరకూ మంత్రులు, ఆయా శాఖాధిపతులు ఒకేచోట ఉంటున్నారని చెప్పారు. మంత్రివర్గ నిర్ణయాల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసు కోడానికి వీల్లేదని చెప్పగానే, నిర్ణయం సహేతుకం కానప్పుడు న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవచ్చునని ధర్మాసనం బదులిచ్చింది. అన్నీ ప్రభుత్వం చెబుతోంది గానీ, వాటిని కౌంటర్ పిటిషన్ ద్వారా హైకోర్టుకు తెలియ జేయట్లేదని ధర్మాసనం పేర్కొంది. కొత్త సచివాలయ నిర్మాణానికి ఎన్ని కోట్లు అవసరం అవుతాయి, నిధులు ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారు, పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుందని అంచనా వేశారు. కొత్త భవనాల డిజైన్ ఏది, ఎంత విస్తీర్ణంలో నిర్మాణం చేయాలని భావిస్తున్నారు, శాఖల వారీగా ఎంత స్థలం అవసరం, మొత్తం 25 ఎకరాల స్థలంలో నిర్మాణం ఏ మేరకు చేస్తారు.. వంటి వివరాలతోపాటు సాంకేతిక కమిటీ నివేదిక ఇతర అంశాలపై రోడ్డు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి