మనలోని మహానుభావుడు చిన్నజీయర్
జీవితం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడే కావాల్సిన వాళ్ళు, అయినవాళ్లు గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఏదైనా పరిష్కారం దొరుకుతుందని చిన్న ఆశ. ఇదే మనుషుల్ని నడిపిస్తోంది. ఇందుకే ఈ లోకంలో అంతులేని ప్రశ్నలు. జవాబులు దొరకని సన్నివేశాలు..ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లి పోవాలని అనుకునే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. ఒక బతుక్కి కావాల్సినంత కరెన్సీ ఉన్నా, అంతులేని సంపద మూలుగుతున్నా, తరాలకు సరిపడా బ్యాంక్ బ్యాలెన్సులున్నా, అంతులేని ఆస్తులు మాటగట్టుకున్నా, చెంతనే చెలిమి తోడున్నా చెప్పుకునేందుకు నా అన్న మనుషులు లేకుండా పోవడం ఎంత బాధాకరం. లోకాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తోందన్న నమ్మకమే, ఆశగా మారి అద్భుతమైన ఆవిష్కరణలకు చోదక శక్తిగా మారింది.
కొందరు దానిని ప్రారబ్ధం అంటే మరికొందరు అదృష్టంగా సరిపుచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో నిరంతర శ్రమ తో నే ఈ ప్రపంచం మొత్తం అభివృద్ధి అనే అడుగుల వైపు ప్రయాణం చేస్తోంది. వేలాది మంది ఈ లోకం పోకడ గూర్చి పరిశోధించారు. అంతులేని దారుల్లో ప్రయాణం చేశారు. ఆ అడుగులు కోట్లాది ప్రజలను ఒకే చోటుకు చేర్చేలా చేశాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. విత్తు ముందా లేక చెట్టు ముందా అన్న దగ్గరి నుంచి నేటికీ యుగాలు గడిచినా, తరాలు మారినా ప్రపంచం పోకడ మారలేదు. అంతే కాదు తన గమన శీలత చట్రం లోంచి బయట పడనూ లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే ప్రతి జీవికి ముందూ వెనుకా ఎవ్వరూ లేక పోయినా ఆత్మ అనేది నడిపిస్తూ ఉంటుంది. ఎలా నడవాలో, ఇంకెలా బతకాలో హెచ్చరిస్తూనే ఉంటుంది.
ఇది లయాత్మకం. సృష్టికి ముందూ వెనుకా అంటూ విలువైన కాలాన్ని బంధించే ప్రయత్నం జరుగుతూనే ఉన్నది అనాది నుంచి. మనుషుల మధ్య ఆధిపత్య పోరు..ఒక్కసారిగా సరిహద్దులు దాటి ప్రాంతాలు, దేశాలను చీల్చింది. అంతులేని అంతరాలను మిగిల్చింది. ఇదే క్రమంలో జీవన సౌరభాన్ని, సౌకర్య వంతంగా ఉండేలా..సాధికారత సమకూర్చేలా ఉండేందుకు యోగులు, బాబాలు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా బతుకులోని మర్మాన్ని, సంతృప్తిని, శాంతిని కలుగ జేసేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అలాంటి ఆధ్యాత్మిక వేత్తల్లో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి మొదటి శ్రేణిలో ఉన్నారు. లక్షలాది మంది భక్తులు ఆయనను అనుసరిస్తున్నారు. తమ ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నారు.
అంతే కాదు ఆయన దర్శనం కోసం, ఇచ్చే తీర్థం కోసం, అందించే ప్రసాదం కోసం, జీవిత కాలం పాటు దాచుకునేలా ఆశీర్వాదం కోసం వేచి ఉంటారు. మానవ సమూహపు ఔన్నత్యం గూర్చి చిన్నజీయర్ స్వామి ఎంతో హృద్యంగా, మనసుకు హత్తుకునేలా బోధిస్తారు. మనతో పాటు ఉంటూనే మనలోకి ప్రవేశిస్తారు. అలా స్వామి వారి సన్నిధిలోకి వెళ్ళిపోయినంత ఆనందం భక్తుల్లో అగుపిస్తుంది. చిన్నజీయర్ స్వామి జగమెరిగిన జగత్ గురువు. బహుభాషా కోవిదుడు. దేని గురించైనా సరే క్షణాల్లో సమగ్ర సమాచారాన్ని భక్త జన బాంధవులకు అర్థమయ్యేలా చెప్పగలరు. ప్రతి ఒక్కరు సామజిక బాధ్యతతో మెలగాలని, తోటి వారి పట్ల దయాగుణం ఉండాలని, తోచిన మేరకు సాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలని సూచిస్తారు. అందుకే అయన నిర్మలంగా ఉంటారు. ఏదైనా సరే ఇవ్వడాన్ని ఒక అభ్యాసంగా మార్చు కోవాలంటారు. అది తమ జీవితంలో తప్పనిసరిగా చేర్చు కోవాలని సూచిస్తారు.
దాతృత్వం అన్నది జన్మతః రావాలి. ఒకరు చెబితే వచ్చేది కాదు. ఇంకొకరు నేర్పితే నేర్చుకోలేరు కూడా. ఇవ్వగలగడం లో ఉన్నంత తృప్తి, సంతోషం, ఆనందం తీసు కోవడంలో ఉండదు. అందుకే ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. విద్యాదానం చేస్తున్నారు. ఈ సమాజానికి కావాల్సిన గొప్ప వ్యక్తులను అంద జేస్తున్నారు. ఈ బృహత్ యజ్ఞంలో ఎందరో పాలుపంచు కుంటున్నారు. తమ గురుతరమైన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. చిన్నజీయర్ స్వామిజి అడుగు జాడల్లో ఇప్పుడు లక్షలాది మంది భక్తులు అనుసరిస్తున్నారు. తమ జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నారు. మొత్తం మీద కనీసం ఒక్కసారైనా చిన్నజీయర్ స్వామి వారిని దర్శనం చేసుకోండి. కావాల్సినంత జోష్ మనకు దక్కుతుంది. లైఫ్ లో ఒక మెమొరీగా మిగిలి పోతుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి