ఈ కోర్సులు చేస్తే చాలు డబ్బులే డబ్బులు

కాలం చెల్లిన కోర్సుల వైపు ఇప్పుడు స్టూడెంట్స్ చూడటం లేదు. లైఫ్ లో త్వరగా సెటిల్ కావాలని కోరుకుంటున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా ప్రపంచంలో వేలాదిగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సటీస్ కు, కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్ లైన్ లో తమకు నచ్చిన కోర్సులు నేర్చుకునే సదుపాయం ఉన్నది. దీంతో విద్యార్థులు, పెద్దలు, ఉద్యోగస్తులు తమకు కావాల్సిన, తమకు నచ్చిన కోర్సులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా నేర్చుకునే వీలుంది. దీంతో ప్రభుత్వం కూడా అందుకు తగినట్టు కోర్సులను రూపొందిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటు చేసుకున్న భారీ మార్పులతో ఇప్పుడు చదువుకోవడం చాలా సులభంగా మారింది. ఇటీవల ఐఐటీ లు కూడా అం లైన్ బాట పట్టాయి. వీటి ద్వారా నేర్చుకునే వెసలుబాటు కల్పిస్తున్నాయి. ఇటీవల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , బిజినెస్ అనలిటిక్స్ , సైబర్ సెక్యూరిటీ , రోబోమెట్రిక్స్, డిజిటల్ మార్కెటింగ్ , డిజిటల్ టెక్నాలజీ, ఎథికల్ హ్యాకింగ్, తదితర కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. వీటిపై కొంచెం కాన్సెన్ట్రేషన్ చేస్తే చాలు లక్షలలో వేతనాలు పొందవచ్చు. ఇక ఇండియాతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యుకె, సింగపూర్ , దుబాయ్, సౌ...