టాలీవుడ్ లో తెలంగాణోళ్ల హల్ చల్

టాలివుడ్ లో ఒకప్పుడు తెలంగాణ అంటేనే చీదరింపులు ఉండేవి. ఇక్కడి వాళ్లకు నటన రాదనీ, వీళ్లకు ఎలా మాట్లాడాలో తెలీదని, అసలు వీళ్ళు నటనకే పనికి రారంటూ విపరీతమైన కామెంట్స్ తో పాటు వివక్ష, వేధింపులు ఎక్కువగా సాగాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత దాకా ఈ ఆధిపత్య ధోరణి కొనసాగుతూ వచ్చింది. ఇదే కొన్నేళ్లు, కొన్ని తరాల పాటు నడిచింది. ఎప్పుడైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో అప్పటి నుంచి నేటి దాకా ప్రచురణ, ప్రసార మాధ్యమాలు కొంత మేర తగ్గాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంతో టాలీవుడ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోలు, నిర్మాతలు, ఇతర సినీ టెక్నీషియన్స్ మాటల్లో కొంత మార్పు కనిపించింది. తెలంగాణా ప్రాంతానికి చెందిన వాళ్ళు దర్శకులుగా, గేయ రచయితలుగా, కమెడియన్లుగా, నటులుగా, సంగీత దర్శకులుగా దుమ్ము రేపుతున్నారు.

తమ సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకుంటున్నారు. మారుతున్న టెక్నలాజిని అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. నితిన్, విజయ్ దేవరకొండ హీరోలుగా పాపులర్ కాగా వెన్నెల కోశోర్ ఇప్పటికే టాప్ రేంజ్ లో ఉన్నారు. మల్లేశం సినిమాతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన అనన్య ఇతర హీరోయిన్స్ కు ధీటుగా నటించారు. ఇక డైరెక్టర్లుగా తమ క్రియేటివిటీతో కోట్లు కురిపించేలా సినిమాలు తీస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో వంగా సందీప్ రెడ్డి ఔరా అనిపించాడు. విజయ్ ని సూపర్ హీరో గా నిలబెట్టింది. సురేందర్ రెడ్డి ఇప్పటికే సక్సెస్ ఫుల్ దర్శకుల జాబితాలో మొదటి ప్లేస్ లో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి తో తాజాగా ఉయ్యాలవాడ నరసింహ్మ రెడ్డి జీవితం ఆధారంగా సైరా పేరుతో సినిమా తీసాడు . ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పైడిపల్లి వంశీ టాప్ హీరోస్ తో సినిమాలు తీసి తనను ప్రూవ్ చేసుకున్నారు. ప్రభాస్, మహేష్ బాబు తో ఇటీవల మహర్షి సినిమా తీసాడు. ఇది హిట్ టాక్ తెచ్చుకుంది. మరో దమ్మున్న డైరెక్టర్ గా హరీష్ శంకర్ పేరు తెచ్చుకున్నారు.

రవితేజతో మిరప కాయ్, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ , బన్నీతో దువ్వాడ జగన్నాథం , వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ తీశాడు. ఈ సినిమాలన్నీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. ఎన్. శంకర్ డైరెక్టర్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. పెళ్లిచూపులు తో తరుణ్ భాస్కర్ పాపులర్ అయ్యాడు. మహానటి తో నాగ్ అశ్విన్ రెడ్డికి జాతీయ స్థాయిలో పేరొచ్చింది. సంకల్ప్ రెడ్డి అంతరిక్షం తో మరోసారి హైలెట్ గా నిలిచాడు. వేణు ఉద్గల నీది నాది ఒకే కథ తీసి విస్తు పోయేలా చేశాడు. సంపత్ నంది కూడా డైరెక్టర్ గా పేరొందారు. మరో వైపు గాయకులుగా రాహుల్ , గేయ రచయితలుగా చంద్ర బోస్, సుద్దాల అశోక్ తేజ, గోరెటి , కాసర్ల శ్యాం , తదితరులు రాణిస్తున్నారు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో వందలాది మంది పాపులర్ అవుతున్నారు. జానపదాలు, పల్లె పాటలు వేలాదిగా అప్ లోడ్ అవుతున్నాయి. బిత్తిరి సత్తి , సావిత్రి, కట్టి కార్తీక లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు టాలెంట్ ఉంటే చాలు తక్కువ సమయం లోనే ఎక్కువ పాపులర్ అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!