ఈ కోర్సులు చేస్తే చాలు డబ్బులే డబ్బులు

కాలం చెల్లిన కోర్సుల వైపు ఇప్పుడు స్టూడెంట్స్ చూడటం లేదు. లైఫ్ లో త్వరగా సెటిల్ కావాలని కోరుకుంటున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా ప్రపంచంలో వేలాదిగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సటీస్ కు, కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్ లైన్ లో తమకు నచ్చిన కోర్సులు నేర్చుకునే సదుపాయం ఉన్నది. దీంతో విద్యార్థులు, పెద్దలు, ఉద్యోగస్తులు తమకు కావాల్సిన, తమకు నచ్చిన కోర్సులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా నేర్చుకునే వీలుంది. దీంతో ప్రభుత్వం కూడా అందుకు తగినట్టు కోర్సులను రూపొందిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటు చేసుకున్న భారీ మార్పులతో ఇప్పుడు చదువుకోవడం చాలా సులభంగా మారింది. ఇటీవల ఐఐటీ లు కూడా అం లైన్ బాట పట్టాయి. వీటి ద్వారా నేర్చుకునే వెసలుబాటు కల్పిస్తున్నాయి.

ఇటీవల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , బిజినెస్ అనలిటిక్స్ , సైబర్ సెక్యూరిటీ , రోబోమెట్రిక్స్, డిజిటల్ మార్కెటింగ్ , డిజిటల్ టెక్నాలజీ, ఎథికల్ హ్యాకింగ్, తదితర కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. వీటిపై కొంచెం కాన్సెన్ట్రేషన్ చేస్తే చాలు లక్షలలో వేతనాలు పొందవచ్చు. ఇక ఇండియాతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యుకె, సింగపూర్ , దుబాయ్, సౌదీ అరేబియా, తదితర దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఎక్కువగా విదేశీ భాసహాల్లో కాష్ఠంత పట్టు సాధిస్తే చాలు ఉన్నచోటునే ఉపాధి పొందే వీలు కలుగుతోంది. అంతే కాకుండా ఫ్రీలాన్స్ పద్దతిలో కూడా ఆన్ లైన్ లో అవకాశాలు దొరుకుతున్నాయి. కావాల్సిందల్లా పట్టుదల మాత్రమే. తాజాగా హయ్యెస్ట్ పైడ్ జాబ్స్ యేవో ఇటీవల ఓ సంస్థ ప్రకటించింది. స్టూడెంట్స్ కొంచెం శ్రద్ధ పెడితే త్వరగా లైఫ్ లో సెటిల్ కావొచ్చు. ఏడాదికి 50 లక్షలు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ జాబ్ చేయాల్సిందే. 

చార్టెడ్ అకౌంట్ ఉద్యోగానికి ఏడాదికి 26 లక్షలు కంపెనీలు వేతనంగా అందజేస్తున్నాయి. అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇక ఆయా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్స్ కు సగటున వార్షిక వేతనం 24 లక్షలు ఉంటోంది. ఇక ఆకాశంలో విహరించాలని అనుకుంటే పైలట్ కోర్స్ చేస్తే దాదాపు 20 లక్షలకు పైగా వేతనం పొందే వీలుంటుంది. ఇక సాఫ్ట్ వెర్ ఇంజనీర్ కు అయితే సంవత్సరానికి 16 లక్షల దాకా వస్తోంది. ఒకప్పుడు లాయర్స్ అన్నా, ఆ కోర్సులు చేసే వాళ్ళన్నా సమాజంలో చులకన భావం ఉండేది. కానీ ఇప్పుడు అది మారింది. పూర్తిగా కార్పొరేట్ కంపెనీలు తప్పనిసరిగా అడ్వొకేట్స్ ను నియమించుకుంటున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొఫెషనల్స్ కూడా భారీగా డిమాండ్ ఉంటోంది. ప్రతి కంపెనీకి కావాల్సిన ఉద్యోగులు మాత్రం బిజినెస్ అనలిటిక్స్ . వీరికి కూడా ఏడాదికి 15 లక్షలు చెల్లిస్తున్నాయి కంపెనీలు. సో స్టూడెంట్స్ కొంచెం కష్టపడితే, మనసు పెడితే లక్షలు పోగేసు కోవచ్చు. 

కామెంట్‌లు