తేజస్ జర్నీ స్టార్ట్ .. సౌకర్యాలు అదుర్స్
ఇప్పటి దాకా రైల్వే అంటేనే ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించే గొప్ప సంస్థ. లక్షలాది మంది ఈ రైల్వే డిపార్ట్ మెంట్ లో రేయింబవళ్లు అలుపెరుగకుండా విధులు నిర్వహిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరాక శరవేగంగా డెసిషన్స్ తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు రైళ్లల్లో జర్నీ చేస్తుంటారు. కోట్లాది రూపాయలు ప్రతి రోజు రైల్వేకు సమకూరుతున్నాయి. మెలమెల్లగా రైల్వేలో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే రైల్వే కార్మిక సంఘాల నేతలు, కార్మికులు అభ్యంతరం చెప్పారు. వారి డిమాండ్లను పట్టించుకోలేదు. ప్రయివేట్ ట్రైన్స్ 150 ని ప్రవేశ పెట్టాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా 2400 ప్రైవేట్ రైళ్లలో కోచులు ఉండబోతున్నాయి. ఒకవేళ తిరిగే ట్రైన్స్ టైంకు రాకపోతే టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు.
తాజాగా దేశం లోనే మొదటి సారిగా ఉత్తర ప్రదేశ్ లో తేజస్ ప్రైవేట్ రైలును ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో ప్రారంభించారు. సీఎం జెండా ఊపి స్టార్ట్ చేశారు. కేవలం ఆరు గంటల్లోనే లక్నో నుంచి ఢిల్లీ నగరానికి ఈ రైలు ద్వారా ప్రయాణం చేసే వీలు కలుగుతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి కార్పొరేట్ ట్రైన్. ఈ రైలుకు తేజస్ అని పేరు పెట్టారు. రూట్లు, టైం స్లాట్స్ ప్రకారం వీటిని కేటాయించనున్నారు. ఇందు కోసం రైల్వే శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. రైళ్లను నడిపేందుకు భారీగా కంపెనీలు ముందుకు రావడం విశేషం. తేజస్ ట్రైన్ వారం లో ఆరు రోజులు ఢిల్లీ నుంచి లక్నో కు ఈ తేజస్ ట్రైన్ నడుస్తుంది. ప్రతి శనివారం ఈ రైలు మొదలవుతుంది. మంగళవారం మాత్రం ఈ ట్రైన్ కు విరామం. ఆరు గంటల నుంచి మరో పదిహేను నిమిషాల లోపు ఢిల్లీకి వెళుతుంది. దేశంలో ఇప్పటివరకు బిగ్ స్పీడ్ గా నడిచే ట్రైన్ స్వర్ణ శతాబ్ది కి పేరుంది.
ఇప్పుడు ఆ రైలును తేజస్ ప్రైవేట్ ట్రైన్ దాటేసింది. ఒకవేళ ఈ రైలుకు జనాదరణ లభిస్తే కనుక దేశంలో మరికొన్ని రైళ్లు ప్రవేశ పెట్టేందుకు రెడీ అవుతోంది రైల్వే శాఖ. లక్నోలో ఉదయం 6 గంటల 10 నిమిషాలకు కచ్చితంగా బయలు దేరుతుంది. ఢిల్లీకి మద్యాహ్నమ్ 12 గంటల 25 నిమిషాలకు తేజస్ ట్రైన్ చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు ఢిల్లీలో 3 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 10 గంటల 5 నిమిషాలకు చేరుకుంటుంది. ఇదే సమయంలో ఎంత ఆలశ్యం అయితే గంటల చొప్పున ట్రావెలర్స్ కు డబ్బులు ఇస్తారు. ప్రతి ప్రయాణికుడికి రెండున్నర లక్షల ఉచిత భీమా కూడా అందజేయనుంది. అయితే చార్జీలు ఒకే రీతిలో ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఇక్కడే తిరకాసు ఉన్నది. తమ ఇష్టానుసారం చార్జీలు పెంచుకునే వీలుంటుంది. ఇది ప్రయాణికులను గుల్ల చేయడం తప్ప మరోటి కాదు. సౌకర్యాల పరంగా వసతులు ఎక్కువగా ఉన్నా చార్జీల మోత మాత్రం సామాన్యులు భరించే పరిస్థితుల్లో లేవన్నది వాస్తవం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి