ఎట్టకేలకు రవిప్రకాష్ అరెస్ట్
చట్టం ముందు అందరూ సమానులే. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఉప్పెనలా, సునామీలా దూసుకు వచ్చిన రవిప్రకాష్ ఇప్పుడు అనూహ్యంగా చంచలగూడ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జర్నలిస్ట్ గా, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ గా, సీఇఓ గా ఇలా ప్రతి ఫార్మాట్ లో సక్సెస్ అయ్యారు. టీవీ-9 అంటేనే రవిప్రకాష్ . రవిప్రకాష్ అంటేనే టీవీ 9 అనే స్థాయికి తీసుకు వచ్చాడు. అద్భుతమైన కంటెంట్ తో ఈ ఛానల్ ను సక్సెస్ చేశాడు. ఈ 24 న్యూస్ ఛానల్ ఎలా నడుస్తుందని అనుకున్నారు అప్పట్లో. అంతా విస్తు పోయారు కూడా. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ టీవీ -9 కొద్దీ కాలంలోనే టాప్ వన్ పొజిషన్ లోకి చేరుకుంది. న్యూస్ ప్రజెంటేషన్ లో ..స్టోరీస్ మేకింగ్ లోను ..టీవీ క్లారిటీ, క్వాలిటీ లో కూడా టీవీ -9 తన దరిదాపుల్లోకి రాకుండా చేసుకుంది. మెలమెల్లగా మిగతా న్యూస్ ఛానల్స్ కూడా వచ్చి చేరాయి. ఈటివి, ఏబీఎన్, టీవీ 5 , సాక్షి, ఎన్ టీవీ , 10 టీవీ , ఎక్స్ ప్రెస్ టీవీ, ఐ న్యూస్ , 99 టీవీ , టీ న్యూస్ , జీ 24 గంటలు తదితర ఛానల్స్ పుట్టుకు వచ్చాయి.
దీనికంతటికి రవిప్రకాష్ స్ఫూర్తి. ఎవరు కాదన్నా ఇది నిజం. ఇదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పూర్తిగా దోపిడీకి , వివక్షకు లోనైంది. ఆధిపత్య పోరు నడిచింది. యాసను, భాషను , ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా రవిప్రకాష్ పట్టించుకోలేదు. పరిగణలోకి తీసుకోలేదు కూడా. పనిచేస్తున్న సిబ్బందిపై వేధింపులు కూడా ఎక్కువై పోయాయి. అంతే కాకుండా ఏనాడూ టీవీ 9 తెలంగాణ ఉద్యమానికి , పోరాటానికి, ఆందోళనకు మద్దతివ్వలేదు. పైపెచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రవిప్రకాష్ తన బుద్దిని మార్చు కోలేదు. హైద్రాబాద్ లోనే ఉంటూ ఇక్కడి సర్కార్ ప్రజా ప్రతినిధుల పట్ల వ్యతిరేక వైఖరి వార్తల రూపంలో ప్రసారం చేశారు. సాక్షాత్తు ఏబీఎన్ , టీవీ 9 న్యూస్ ఛానల్స్ అనుసరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెల్ల పాటు పూర్తిగా తెలంగాణాలో ప్రసారాలు నిలిపి వేశారు. దీంతో ఒక్కసారిగా భారీ ఆదాయాన్ని కోల్పోయాయి ఈ రెండు ఛానల్స్. ఇదే క్రమంలో ఛానల్ ను మై హోమ్ రామేశ్వర్ రావు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. టీవీ 9 ఛానల్ పూర్తిగా తనదిగా పేర్కొంటూ వచ్చారు రవిప్రకాష్.
రామేశ్వర్ రావు పై ఆరోపణలు కూడా చేశారు రవిప్రకాష్. కొత్త యాజమాన్యం తమకు తెలియకుండానే డబ్బులు డ్రా చేసుకున్నాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన ఇంటికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇంటిని వాటిని అతికించారు. కంపెనీ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండానే మూడు కోట్లకు పైగా డబ్బులు రవిప్రకాష్, ఫైనాన్షియల్ ఆఫీసర్ మూర్తి డ్రా చేసారని మరోసారి ఫిర్యాదు చేశారు. డిఎస్పీ సుమతి ఆధ్వర్యంలో రవిప్రకాష్ ను అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. అంతకు ముందు ఆయనకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం రవిప్రకాష్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా అరెస్ట్ కంటే ముందు కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. నన్నే పోలీస్ స్టేషన్ కు పిలుస్తారా..అసలు నేను ఎవరనుకుంటున్నారంటూ రెచ్చి పోగా ఏసీపీ తనదైన శైలిలో రివర్స్ సమాధానం చెప్పడంతో దెబ్బకు మనోడు దిగి వచ్చినట్టు తెలిసింది. మొత్తం మీద రాజ్యం బలీయమైనదని తెలుసుకోవాలి. ఏపీలో జగన్ తో ఇటు కేసీఆర్ తో రవిప్రకాష్ పోటీ పడటం కొంచం కష్టమే. దానికి చాలా బలం కావాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి