మీడియాలో రారాజు..బిజినెస్‌లో మారాజు..ఉదయశంకర్ ట్రెండ్ సెట్టర్ ..!

మాస్ మీడియాలో స్టార్ టీవీ గ్రూప్ తన హవాను అప్రహతిహంగా కొనసాగిస్తోంది. ఇండియన్ ఎంటర్‌టైన్మెంట్ రంగంలో రికార్డులను తిరగ రాసి మిగతా మీడియా సంస్థలను, దిగ్గజాలను కోలుకోలేకుండా చేసింది. వ్యాపార పరంగా చూస్తే న్యూ ట్రెండ్స్ ను సృష్టిస్తోంది. ఇండియా అంటేనే క్రికెట్ ..ఇపుడు ప్రసార హక్కులను ఎవరూ ఊహించని రీతిలో బిడ్‌లో పాల్గొని ప్రసార హక్కులను స్వంతం చేసుకుని తన రికార్డులను తానే అధిగమించింది. ఇదంతా ఒక్కరోజులో జరిగిన ప్రయాణం అనుకుంటే పొరపాటు పడినట్లే. స్టార్ దూకుడుకు ఇతర సంస్థలన్నీ నిమ్మకుండి పోయాయి. స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్రాండ్ ను తీసుకు వచ్చిన ఘనత ఒక్కడిదే ..అతనే ఉదయ శంకర్ . కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం..ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం. వ్యాపార పరంగా దెబ్బ తీయడం..అన్ని రంగాలను పటిష్టవంతం చేయడం..అపారమైన అనుభవం కలిగిన ..విశిష్టమైన వ్యక్తులను ..విజేతలను తన టీంలో చేర్చుకోవడం..అటు క్రియేటివిటీకి..ఇటు ఐడెంటిటీకి..సక్సెస్‌కు ఎదురే లేకుండా చేయడంలో ఆయన అందరికంటే ముందు వరుసలో నిలిచ...