మీడియాలో రారాజు..బిజినెస్‌లో మారాజు..ఉదయశంకర్ ట్రెండ్ సెట్టర్ ..!
మాస్ మీడియాలో స్టార్ టీవీ గ్రూప్ తన హవాను అప్రహతిహంగా కొనసాగిస్తోంది. ఇండియన్ ఎంటర్‌టైన్మెంట్ రంగంలో రికార్డులను తిరగ రాసి మిగతా మీడియా సంస్థలను, దిగ్గజాలను కోలుకోలేకుండా చేసింది. వ్యాపార పరంగా చూస్తే న్యూ ట్రెండ్స్ ను సృష్టిస్తోంది. ఇండియా అంటేనే క్రికెట్ ..ఇపుడు ప్రసార హక్కులను ఎవరూ ఊహించని రీతిలో బిడ్‌లో పాల్గొని ప్రసార హక్కులను స్వంతం చేసుకుని తన రికార్డులను తానే అధిగమించింది. ఇదంతా ఒక్కరోజులో జరిగిన ప్రయాణం అనుకుంటే పొరపాటు పడినట్లే. స్టార్ దూకుడుకు ఇతర సంస్థలన్నీ నిమ్మకుండి పోయాయి. స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్రాండ్ ను తీసుకు వచ్చిన ఘనత ఒక్కడిదే ..అతనే ఉదయ శంకర్ . కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం..ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం. వ్యాపార పరంగా దెబ్బ తీయడం..అన్ని రంగాలను పటిష్టవంతం చేయడం..అపారమైన అనుభవం కలిగిన ..విశిష్టమైన వ్యక్తులను ..విజేతలను తన టీంలో చేర్చుకోవడం..అటు క్రియేటివిటీకి..ఇటు ఐడెంటిటీకి..సక్సెస్‌కు ఎదురే లేకుండా చేయడంలో ఆయన అందరికంటే ముందు వరుసలో నిలిచారు.
ఎక్కడా తొట్రుపాటు లేకుండా..అంతులేని విశ్వాసంతో ..ఏది పట్టుకున్నా ఆయన విజేతగా నిలుస్తూ వస్తున్నారు. వరల్డ్ మార్కెట్‌లో ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా ..అందనంత ఎత్తులో స్టార్ టీవీ గ్రూప్‌ను నిలబెట్టారు ఉదయ శంకర్. కమిట్‌మెంట్..కనెక్టివిటీ..కాన్ఫిడెన్స్..లీడర్ షిప్..సక్సెస్‌కు పెట్టింది పేరు. మాస్ మీడియాలో ఇపుడు స్టార్ ఓ సంచలనం. ఆ గ్రూపులో చేరడమంటే మనల్ని మనం విజేతలుగా ప్రకటించు కోవడమే. దక్షిణ ఆసియా, మిడిల్ ఈస్ట్ , యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా, తదితర దేశాలకు విస్తరించింది. తన ప్రసారాలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. 21 సెంచరీ ఫాక్స్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తోంది. స్టార్ ను ఉన్నత స్థాయికి తీసుకు వచ్చిన చరిత్ర మాత్రం ఉదయ శంకర్ దే. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఏం చేసినా ఓ చరిత్రకు నాంది పలుకుతోంది. ఉదయ శంకర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టాక..మీడియా రంగంలో రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. వ్యూవర్ షిప్‌లో 720 మిలియన్ వ్యూవర్స్‌ను అధిగమించింది స్టార్ గ్రూప్. ఇండియాతో పాటు మరో 100 దేశాలకు విస్తరించింది. 66 చానల్స్‌తో 30 వేల గంటలకు పైగా కంటెంట్‌ను అప్ డేట్ చేస్తోంది..ఇది వినోద రంగంలో ఓ రికార్డుగా నమోదైంది.
వ్యూహాత్మక అడుగులు వేస్తూ..తాను పనిచేస్తూ..తన టీం సభ్యులతో అద్భుతాలు సృష్టింప చేస్తున్న తీరు ఉదయ శంకర్‌ను సక్సెస్ ఫుల్ సీఇఓగా నిలబెట్టింది..ఇపుడు ప్రతి ఇంటా ..ప్రతి చోటా తనదైన ముద్రతో సాగుతోంది. శాటిలైట్ ఏషియన్ రీజియన్ పేరుతో హచిసన్ వాంపా, లి..కా..షింగ్ సంయుక్త భాగస్వామ్యం పేరుతో 1990లో స్టార్ట్ అయింది. స్టార్ ఇండియా , స్టార్ ప్లస్ , ప్రైమ్ స్పోర్ట్స్, ఎంటివి, స్టార్ మూవీస్ తో పాటు జీ టీవీతో ప్రసారాలు ఇండియాలో మొదలయ్యాయి. వరల్డ్ మీడియా మార్కెట్‌లో కింగ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్న రూపర్ట్ ముర్దోచ్ అధిపతిగా ఉన్న న్యూస్ కార్పొరేషన్ 525 మిలియన్ డాలర్లకు న్యూస్ కార్పొరేషన్ కొనుగోలు చేసి..ఔరా అనేలా చేసింది. 1993లో 36.4 శాతాన్ని ఫాక్స్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రెమిసెస్ పేరుతో కార్యకలాపాలు సాగించింది. 1994 నుండి 1998 మధ్య కాలంలో స్టార్ టీవీ ..మూవీస్, మ్యూజిక్ రంగాలలోకి ప్రవేశించింది. స్టార్ మూవీస్, వి- మ్యూజిక్ చానల్, స్టార్ న్యూస్ చానళ్లకు శ్రీకారం చుట్టింది. 2001 నుండి 2010 వరకు మరింతగా విస్తరించింది. సౌత్ ఇండియాలో సక్సెస్ బాటలో పయనిస్తున్న విజయ్ టీవీని 2003లో స్టార్ ఇండియా భారీ ఆఫర్ ఇచ్చి..స్వంతం చేసుకుంది. ఇండియాలో న్యూస్ పరంగా కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌డిటీవిని చేజిక్కించుకుంది. ఇది 24 గంటల న్యూస్ చానల్‌గా న్యూస్, వార్తల పరంగా మంచి పేరు తెచ్చుకుంది.
ఆనంద్ బజార్ పత్రిక కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నది. ఈ పత్రికకు అపరితమైన ఆదరణ ఉన్నది. 2012లో దీనిని కొనుగోలు చేశాక..దీనిని ఏబీపీ న్యూస్ గా విడదీశారు. 2004లో హిందీ లో ఏకంగా స్టార్ చానల్ కొత్తగా ప్రారంభించింది. బెంగాల్‌లో స్టార్ ప్రవాహ్ పేరుతో ఎంటర్‌టైన్మెంట్ చానల్ ప్రారంభించింది. మరో చానల్‌ను మరాఠీ భాషలో స్టార్ట్ చేసింది. తమిళనాడులో పాగా వేసిన స్టార్ ఇండియా గ్రూప్.. కేరళలో కాన్ సెంట్రేషన్ చేసింది. మళయాలంలో తిరుగులేని శక్తిగా పేరు తెచ్చుకున్న ఏషియానెట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్న ఏషియానెట్ చానల్‌ను ఆగష్టు 2009లో స్వంతం చేసుకుంది. మూడు యూనిట్లుగా విభజించింది. స్టార్ ఇండియా, స్టార్, ఫాక్స్ ఇంటర్నేషనల్ చానల్స్ గా మార్చేశారు సిఇఓ ఉదయ్ శంకర్. ఇదే సంవత్సరంలో స్టార్ అఫిలియేట్ తో పాటు సిజె గ్రూప్ పేరుతో సౌత్ కొరియాలో సిజె అలైవ్ పేరుతో మరో చానల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఈ చానల్ షాప్ సీజే గా మార్చేశారు. ఇది 24 గంటల పాటు స్టార్ ఉత్సవ్ షాపింగ్ చానల్ ను ఏర్పాటు చేశారు. 6 గంటల పాటు స్లాట్స్ మొదట కేటాయించినా..తర్వాత 24 గంటల పాటు కొనసాగుతోంది.
మే 2014లో జాయింట్ వెంచర్‌గా మార్చేశారు. ఇదే సంవత్సరంలో 21వ సెంచరీ ఫాక్స్ పేరుతో లాంచ్ అయింది. ఫాక్స్ స్టార్ స్టూడియో ద్వారా ఫిల్మ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేలా తీర్చిదిద్దారు. 2012లో స్టార్ ఇండియా పేరు ప్రపంచాన్ని విస్తుపోయే నిర్ణయం తీసుకుంది. అత్యంత సుసంపన్నమైన ..అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరొందిన బీసీసీఐ ప్రసార హక్కులను ..2012 నుండి 2018 వరకు చేజిక్కించుకుంది. ఇఎస్పీఎన్ పేరుతో టెలికాస్ట్ అవుతున్న ఈ చానల్‌ను స్టార్ 4 , స్టార్ క్రికెట్‌ను స్టార్ స్పోర్ట్స్ చానల్‌గా మార్చేశారు. 1, 2 చానల్స్ విభజించారు. స్టార్ క్రికెట్ హెచ్ డి, ఈఎస్‌పీఎన్ హెచ్‌డి చానల్స్‌ను స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డి 1 , స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డి2 చానల్స్ గా మారాయి. సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్‌ను గుర్తించారు ఉదయ్ శంకర్. 2015లో వీక్షకుల భావోద్వేగాలను ప్రసారం చేయడంలో స్టార్ గ్రూప్ అన్ని సంస్థలకంటే ముందంజలో ఉంది. హాట్ స్టార్ పేరుతో వీడియోలను వీక్షించేలా స్టార్ట్ చేశారు. ఇదే సంవత్సరంలో స్టార్ గ్రూప్ ..దక్షిణాసియాలో తెలుగు వినోద రంగంలో తనకంటూ ఓ బ్రాండ్‌ను స్వంతం చేసుకున్న మా టీవీ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. తెలుగు రీజినల్ మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంది. 2017 ఫిబ్రవరిలో స్టార్ ఇండియా గ్రూప్ సమర్థవంతమైన సంస్థగా నిలిచేలా చేయడంలో ఉదయ్ శంకర్ కీలక భూమిక పోషించారు.
స్టార్ గ్రూప్ గ్లోబల్ మీడియాలో పేరొందిన టెడ్‌ను స్వంతం చేసుకుంది. టెడ్ టాక్స్‌కు భారీ ఆదరణ ఉన్నది. దీని ద్వారా నయీ సోచ్ పేరుతో ప్రారంభించారు. హిందీ భాషలో బాలీవుడ్ బాద్షా గా పేరొందిన షారూక్ ఖాన్ తో హోస్టింగ్ చేయించారు. 18 నిమిషాల నిడివి కలిగిన వీడియోలను తీర్చిదిద్దారు. లైవ్ ఆడియన్స్‌ను స్టార్ గ్రూప్ టార్గెట్ చేసింది. 2017 ఆగస్టు 28న హిందీ ఎంటర్‌టైన్మెంట్ రంగంలో లైఫ్ ఓకె పేరుతో చానల్ ప్రారంభించింది. దీనిని స్టార్ భరత్‌గా మార్చేసింది. 5 సెప్టెంబర్ 2017లో ఇండియన్ ప్రిమియర్ లీగ్ అంటే ఐపీఎల్ ప్రసార హక్కులను బీసీసీఐ ఊహించని స్థాయిలో బిడ్‌లో పాల్గొని చేజిక్కించుకుంది. ఐదేళ్ల పాటు స్వంతం చేసుకుంది. ఏకంగా 16 వేల 347 .50 కోట్లకు కొనుగోలు చేసి..రికార్డ్ సృష్టించింది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ కు షాకిచ్చింది స్టార్ గ్రూప్. 14 డిసెంబర్ 2017లో ద వాల్ట్ డిస్నీ కంపెనీ 21వ సెంచరీ ఫాక్స్ పేరుతో స్టార్ గ్రూప్ లాంచ్ చేసింది. 13 డిసెంబర్ 2018లో వాల్ట్ డిస్నీ కంపెనీ స్టార్ ఇండియా గ్రూప్‌నకు ఛైర్మన్‌గా..సిఇఓగా ఉదయ్ శంకర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. 4 జనవరి 2019లో స్టార్ టీవీ అన్ని చానల్స్‌ను హై డెఫిసియన్సీ చానల్స్‌గా మార్చేందుకు కొన్ని రోజుల పాటు ప్రసారాలను నిలిపి వేసింది. ఒక్కసారిగా ప్రపంచం నివ్వెర పోయింది..కానీ స్టార్ గ్రూప్ ఏ నిర్ణయం తీసుకున్నా..ఏం చేసినా అది సంచలనమే..
ఇపుడు స్టార్ గ్రూప్ వినోద రంగంలో అతి పెద్ద భాగస్వామి సంస్థగా నిలిచింది..వినోద రంగంలో 51 చానల్స్..క్రీడా విభాగంలో 15 చానల్స్ వినోదం పంచుతున్నాయి. స్టార్ ప్లస్, స్టార్ భరత్, స్టార్ ఉత్సవ్, స్టార్ ఉత్సవ్ మూవీస్, స్టార్ గోల్డ్, స్టార్ గోల్డ్ సెలెక్ట్, మూవీస్ ఓకె, స్టార్ వరల్డ్, స్టార్ వరల్డ్ ప్రిమియర్, స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, నేషనల్ జియోగ్రాఫిక్ చానల్, నాట్ జియో వైల్డ్, నాట్ జియో పీపుల్, నాట్ జియో మ్యూజిక్, ఫాక్స్ లైఫ్, బేబి టీవీ, స్టార్ జల్సా, స్టార్ జల్సా మూవీస్, స్టార్ ప్రవాహ్, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, స్టార్ మా మ్యూజిక్, స్టార్ విజయ్, స్టార్ విజయ్ సూపర్, స్టార్ సువర్ణ, స్టార్ సువర్ణ ప్లస్, ఏసియా నెట్, ఏసియా నెట్ ప్లస్, ఏసియా నెట్ మూవీస్, స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 హింది, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ ఇండియా డిజిటల్ ఆన్ లైన్ యాప్, హాట్ స్టార్ ..పేరుతో ప్రసారమవుతున్నాయి.
ఇండియాలో ఆదరణకు నోచుకోని క్రీడలపై దృష్టి సారించింది. వాటిని కూడా ప్రసారం చేస్తూ తన వ్యూవర్ షిప్‌ను పెంచుకుంటోంది. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, తదితర ఆటలను ప్రోత్సహిస్తోంది. దేవదర్ , రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లను టెలికాస్ట్ చేస్తోంది. యూనివర్శిటీ స్థాయిలలో జరిగే క్రీడలకు మద్ధతు పలికింది. స్టార్ గ్రూప్ ప్రపంచంలోని వినోద రంగంలో అత్యంత నమ్మకమైన..శక్తివంతమైన..భారీ ఆదాయం కలిగిన సంస్థగా అవతరించింది. ఇలా కావడం వెనుక ఒకే ఒక్కడి కృషి ఉంది..అతడే సిఇఓ గా ఉన్న ఉదయ్ శంకర్. గ్లోబల్ ఎంటర్‌టైన్మెంట్ రంగంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఉదయ్ శంకర్ నిలిచారు. రియల్లీ గ్రేట్ స్టార్‌గా ఎదిగారు..కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. నాయకత్వ రంగంలో భారతీయులు రాణిస్తారనే దానికి ఆయనే ప్రత్యక్ష ఉదాహరణ. అంతులేని శక్తి కావాలన్నా..విజేతగా నిలవాలంటే ..ఉదయ్ శంకర్‌ను చూడండి చాలు..ఇండియన్స్‌గా మనమూ గర్వపడదాం. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి