ట్రిలియన్ డాలర్ల కోచ్ బిల్ కాంప్ బెల్

ఏ ఆటగాడికైనా కోచింగ్ అన్నది అవసరం. అది లేకుండా ఎక్కువ కాలం మైదానంలో ఉండలేరు. ప్రతి ఒక్కరికి శిక్షణ అన్నది ముఖ్యం. అందుకే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటాయి ఆటగాళ్ల మీద. ఫుట్ బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఖోఖో, హాకీ, కబడ్డీ ఇలా ప్రతి ఆటకు టీం కోచ్ తో పాటు ప్రత్యేక ట్రైనర్స్, మెంటార్స్ తప్పక ఉంటారు. ఆయా క్రీడా సంఘాలు, సంస్థలు, కంపెనీలు, స్పాన్సరర్స్, యాజమాన్యాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కోచింగ్ అన్నది ఇవాళ ఆటలో భాగమై పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో కోచ్‌లు ఉన్నారు. కానీ కాంప్ బెల్ కోచింగ్ డిఫరెంట్. ఆయన కోచింగ్ ఇచ్చాడంటే ..అవతల ప్రత్యర్థులు జడుసుకుంటారు. అంతలా క్రీడాకారులను మోటివేట్ చేశారు. ఆయన అనుసరించిన పద్ధతులు కొత్తగా ఉంటాయి. టెక్నాలజీతో కూడుకుని ఉంటాయి. అంతేనా ..గూగుల్, యాపిల్, ఇన్‌ట్రూట్ దిగ్గజ కంపెనీలన్నీ కాంప్ బెల్ తో తమ ఉద్యోగులకు కోచింగ్ ఇప్పించాయి. ఆటకు ఈ ఐటీ కంపెనీలకు ఏం సంబంధం అనుకుంటున్నారా..దీనిని కాంప్ బెల్ ఒప్పుకోరు. ప్రతిదీ ఆటేనంటారు. ఇక్కడ ఆటగాళ్లుంటారు. అక్కడ ఉద్యోగులుం...