ట్రిలియన్ డాలర్ల కోచ్ బిల్ కాంప్ బెల్
ఏ ఆటగాడికైనా కోచింగ్ అన్నది అవసరం. అది లేకుండా ఎక్కువ కాలం మైదానంలో ఉండలేరు. ప్రతి ఒక్కరికి శిక్షణ అన్నది ముఖ్యం. అందుకే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటాయి ఆటగాళ్ల మీద. ఫుట్ బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఖోఖో, హాకీ, కబడ్డీ ఇలా ప్రతి ఆటకు టీం కోచ్ తో పాటు ప్రత్యేక ట్రైనర్స్, మెంటార్స్ తప్పక ఉంటారు. ఆయా క్రీడా సంఘాలు, సంస్థలు, కంపెనీలు, స్పాన్సరర్స్, యాజమాన్యాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కోచింగ్ అన్నది ఇవాళ ఆటలో భాగమై పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో కోచ్‌లు ఉన్నారు. కానీ కాంప్ బెల్ కోచింగ్ డిఫరెంట్. ఆయన కోచింగ్ ఇచ్చాడంటే ..అవతల ప్రత్యర్థులు జడుసుకుంటారు. అంతలా క్రీడాకారులను మోటివేట్ చేశారు. ఆయన అనుసరించిన పద్ధతులు కొత్తగా ఉంటాయి. టెక్నాలజీతో కూడుకుని ఉంటాయి.
అంతేనా ..గూగుల్, యాపిల్, ఇన్‌ట్రూట్ దిగ్గజ కంపెనీలన్నీ కాంప్ బెల్ తో తమ ఉద్యోగులకు కోచింగ్ ఇప్పించాయి. ఆటకు ఈ ఐటీ కంపెనీలకు ఏం సంబంధం అనుకుంటున్నారా..దీనిని కాంప్ బెల్ ఒప్పుకోరు. ప్రతిదీ ఆటేనంటారు. ఇక్కడ ఆటగాళ్లుంటారు. అక్కడ ఉద్యోగులుంటారు. సేమ్ టు సేమ్ అన్నమాట. ట్రిలియన్ డాలర్ కోచ్ పేరుతో పుస్తకం విడుదలైంది. ఇది రికార్డు స్థాయిలో అమ్ముడు పోయింది. గూగుల్స్ ఎరిక్ , జొనాథన్ రోసెన్ బర్గ్ రాశారు ఈ పుస్తకాన్ని. బిల్ కాంప్ బెల్ ఫుట్ బాల్ ప్లేయర్‌గా , కోచ్‌గా స్టార్ట్ చేశాడు. కొలంబియా యూనివర్శిటీలో ఎకనమిక్స్‌లో డిగ్రీ చేశాడు. ఎడ్యూకేషన్‌లో మాస్టర్స్ చేశాడు. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా యాపిల్ కంపెనీలో చేరాడు. మార్కెటింగ్ అండ్ సేల్స్ ఇంఛార్జిగా ఉన్నారు.
క్లారిస్ అండ్ ఇన్‌ట్రూట్ కంపెనీకి సిఇఓగా ఉన్నారు. ఆ తర్వాత గూగుల్, యాపిల్ కంపెనీలకు ప్రధాన కోచర్‌గా ఎంపికయ్యాడు కాంప్ బెల్. ఈబే ఈకామర్స్ కంపెనీ సిఇఓకు ట్రైనింగ్ ఇచ్చాడు. ట్విట్టర్, నెక్ట్స్ డోర్, మ్యాట్రిక్ స్ట్రీం , చెగ్ కంపెనీల సిఇఓలకు కాంప్ శిక్షణ ఇచ్చాడు. ఓ ఆటగాడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం చివరకు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పవర్ ఫుల్ మోటివేటర్‌గా ఎదిగాడు. రాబోయే తరాలు గుర్తుంచుకునేలా లెసన్స్ తయారు చేశాడు. పెట్టుబడి దారులు, యూనివర్శిటీ బాధ్యులకు కూడా ఆయన ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. 75 ఏళ్ల వయసులో 2016లో ఈ లోకం నుంచి నిష్క్రమించాడు క్యాంప్ బెల్. ఎంతో మంది ఆయనను ఇంటర్వ్యూ చేశారు.
వారిలో 80 మందితో ఆయన మాట్లాడిన మాటలను ఇందులో పొందు పరిచారు. కాంప్ బెల్‌తో కలిసి పని చేసిన వారి అనుభవాలను ఇందులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కోచ్‌గా ఇప్పటికే మొదటి వరుసలో నిలుస్తారు బిల్ ప్రపంచంలోనే . 220 పేజీలు కలిగిన ఈ పుస్తకం కాంప్ బెల్ జీవితాన్ని ఆవిష్కరించింది. ప్రజలు నాయకత్వం, నమ్మకాన్ని పెంపొందించు కోవడం ఎలా, టీంను ఎలా బిల్డ్ చేసుకోవాలి..?, ద పవర్ ఆఫ్ లవ్ అన్నది ముఖ్యమంటారు బెల్. ఇవాళ కాంప్ బెల్ మన మధ్య లేక పోయినా ఆయన పేరుతో వచ్చిన ట్రిలియన్ డాలర్ కోచ్ పుస్తకం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కోట్లు కొల్లగొడుతోంది..డాలర్లను పోగు చేస్తోంది. బిల్ లేక పోయినా ఆయన ప్రభావం ఇంకా వెంటాడుతూనే ఉన్నది ఈ లోకాన్ని.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి