చిరు వ్యాపారులకు అండగా షిప్ రాకెట్
ఈకామర్స్ బిజినెస్ రోజు రోజుకు విస్తరిస్తోంది. దీంతో రిటైల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. వినియోగదారులు, ప్రజలు ఎక్కువగా ఆన్ లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ రంగంలో, ఈకామర్స్ బిజినెస్‌లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, రిలయన్స్ తదితర సంస్థలు తమ వాటాను పెంచుకునేందుకు పోటీ పడుతున్నారు. దీంతో కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు రోజుకో ఆఫర్లు ప్రకటిస్తూ జనాన్ని ఒక్క చోట నిలువనీయకుండా చేస్తున్నాయి. భారీ ఆఫర్లు, క్యాష్ ప్రైజెస్, గిఫ్ట్‌లు, నజరానాలు, కార్లు, ఇతర వాల్యూ కలిగిన వస్తువులను కస్టమర్లకు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో చిరు వ్యాపారుల దందా ఇపుడు మూసుకునే పరిస్థితికి వచ్చింది. సూది నుంచి ప్రతి వస్తువు ఆన్‌లైన్లో దొరుకుతోంది.
తయారు చేసే కంపెనీలతో ఈ కామర్స్ కంపెనీలు ఒప్పందం చేసుకుంటున్నాయి. దీంతో తయారైన క్షణాల్లోపే ఆయా కంపెనీల గోడన్లలోకి చేరుతున్నాయి. ఏ రంగంలో ఉన్నా సరే..చిరు వ్యాపారం చేసే వ్యాపారుల ఇబ్బందులు గమనించింది షిప్ రాకెట్ సంస్థ. ఢిల్లీ కేంద్రంగా ఇది అంకుర కంపెనీగా ప్రారంభమైంది. మధ్య దళారీల ప్రమేయం లేకుండానే వారు తయారు చేసిన వస్తువులను నేరుగా ఈ కామర్స్ కంపెనీల ద్వారా అమ్ముకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే డెలివరీ అన్నది కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా షిప్ యార్డు ద్వారా వస్తువులను సరఫరా చేయడం అన్నది భారీ ఖర్చుతో కూడుకున్న పని. దీనిని అధిగమించేందుకు ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ వాడుతోంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభమైన షిప్ రాకెట్ స్టార్టప్ తో అమెరికా దిగ్గజ కంపెనీ అమెజాన్ దీనితో జత కట్టింది.
చిరు వ్యాపారులకు ఆదాయం కల్పించే యోచనతో ఏకంగా 100 కోట్ల రూపాయలను పొందింది. స్మాల్ , మీడియం వ్యాపారస్తులను ఒకే ప్లాట్ ఫాం మీదకు తీసుకు వచ్చింది ఈ కంపెనీ. నేరుగా తమకు నచ్చిన ఏ వస్తువునైనా కొనుగోలు చేసేందుకు వీలు కల్పించింది. ఎంతో మంది చిరు వ్యాపారస్తులకు ఒక వేదిక అంటూ లేకుండా పోయింది. కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. కానీ తమ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధర దొరకడం లేదు. రవాణా చార్జీల మోత బరువుగా మారింది. కూలీల సమస్య నెలకొంది. ఆన్ లైన్‌లో అయితే ఎలాంటి రిస్క్ ఉండదు. ఎవరి ప్రమేయం లేకుండానే ఆర్డర్స్ ఇస్తే చాలు ..కస్టమర్లకు నేరుగా పంపించేందుకు వీలు కలుగుతుంది.
ఒక్క భారత దేశంలోనే 50 మిలియన్ల మంది చిరు, మధ్య తరహా వ్యాపారస్తులు ఉన్నట్లు 2018లో నిర్వహించిన సర్వేలో తేలింది. హోమ్ ఆంట్రప్రెన్యూర్స్, ఎస్ ఎం బిలను ఏర్పాటు చేయించింది అమెజాన్. అసంఘటిత రంగంలో ఉన్న ఈ వ్యాపారులు ఇటీవలే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాం, వాట్స్ అప్ ద్వారా డైరెక్టుగా అమ్ముతున్నారు. కానీ వీరికి ఒక కామన్ ప్లేస్ అంటూ లేకుండా పోయింది. సోషల్ సెల్లర్స్ కు తమ సరుకులు, ఉత్పత్తులను పంపించాలంటే ఢిల్లీ వెరీ, బ్లూ డార్ట్ ల మీద ఆధారపడాల్సి వస్తుంది. రోజుకు నాలుగైదు ఆర్డర్లు వస్తున్నాయి. ఇదేమంత గిట్టుబాటు కావడం లేదు వ్యాపారస్తులకు.
వచ్చిన ఆదాయం అంతా వీటిని డెలివరీ చేసేందుకు ఖర్చవుతోంది. దీనిని గుర్తించారు షిప్ రాకెట్ నిర్వాహకులు. క్రాఫ్ట్లీ పేరుతో వెబ్ సైట్‌ను రూపొందించారు. కానీ ఇబ్బందులు మాత్రం తొలగలేదు. సాహిల్ గోయెల్ స్మాలర్ సెల్లర్స్‌కు లబ్ది చేకూరేలా ఒకే ప్లాట్ ఫాం ను రూపొందించారు. అదే షిప్ రాకెట్. దీంతో టై అప్ అయితే చాలు ..మీ వస్తువులు భద్రంగా ఇంటికి చేరుకుంటాయి. ఇదే భరోసా కోట్లను కొల్లగొట్టేలా చేసింది. వీరి ఆలోచన అమెజాన్‌కు నచ్చింది..ఆల్ స్మాల్, మీడియం వ్యాపారస్తులకు అండగా ఉండేలా దీంతో టై అప్ చేసుకుంది. సో చిన్నపాటి ఐడియా కాసులు కురిపించేలా చేస్తుందన్నది వీరిని చూస్తే అర్థమవుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి