మాలిక్ పునరాగమనం

అదృష్టం అంటే ఇదేనేమో. అది ఏ రూపంలో ఎప్పుడు పలకరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. పాకిస్తాన్‌ మాజీ సారథి, ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ అనూహ్యంగా పాకిస్తాన్‌ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడబోయే పాకిస్తాన్‌ జట్టును ఆ దేశ సెలక్లర్లు ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన పాక్‌ జట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అంతే కాకుండా అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ హారిస్‌ రౌఫ్‌, అహ్సన్‌ అలీలను కూడా ఎంపిక చేశారు. అయితే సీనియర్‌ బౌలర్లు మహ్మద్‌ అమిర్‌, వాహబ్‌ రియాజ్‌లను జట్టు నుంచి తప్పించడం గమనార్హం.

గత కొంత కాలంగా ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న మాలిక్‌ పాక్‌ జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలోనే వన్డేలకు గుడ్‌బై చెప్పిన మాలిక్‌ టీ20ల్లో కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ క్రికెట్‌ను గాడిన పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని, దీనిలో భాగంగానే జట్టులో మార్పులు చేపట్టామని ఆ దేశ ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ మిస్బావుల్‌ హక్‌ పేర్కొన్నాడు. తామి ఆడిన చివరి 9 టీ20 సిరీస్‌ల్లో 8 ఓడి పోయామని గుర్తు చేసిన ఆయన ఇక ఓటముల పరంపరకు చెక్‌ పెట్టబోతున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌, ప్రపంచకప్‌ గెలిచే పాక్‌ జట్టును తయారు చేస్తున్నామన్నాడు.

మాలిక్‌, హపీజ్‌లు తమ అనుభవంతో పాక్‌ జట్టుకు పునర్వైభవం తీసుకొస్తారనే ధీమా వ్యక్తం చేశాడు. ఇక మాలిక్‌ ఎంపిక పట్ల పాక్‌ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురువుతున్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ జట్టు ఇలా ఉంది. బాబర్‌ అజమ్‌ కెప్టెన్ కాగా అహ్సన్‌ అలీ, అమద్‌ బట్‌, హారీస్‌ రౌఫ్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఇమాద్‌ వసీమ్‌, కౌష్దిల్‌ షా, మహ్మద్‌ హఫీజ్‌, మహ్మద్‌ హస్నైన్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, ముసా ఖాన్‌, షాదాబ్‌ ఖాన్‌, షహీన్‌ షా ఆఫ్రిది, షోయబ్‌ మాలిక్‌, ఉస్మాన్‌ ఖాదిర్‌ జట్టులో ఉన్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!