అయ్యో హ్యారిస్ అవుట్
అమెరికన్ పాలిటిక్స్ లో అరుదైన, అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యుఎస్ ప్రెసిడెంట్ పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల పోటీ నుంచి డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన 54 ఏళ్ళ కమలా హ్యారిస్ నిష్క్రమించారు. ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఈ కాలిఫోర్నియా సెనెటర్ వెల్లడించారు. నేను బిలియనీర్‌ను కాదు. నా ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లలేను. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు నా వద్ద సరిపడా ఆదాయ వనరులు లేవు. ఇందు కోసం అన్ని మార్గాలు నేను అన్వేషించాను. అయితే కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల నా జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ ఏడాది జనవరిలో కమలా హ్యారిస్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి అని ఆమె తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్ నుంచి కమలా హ్యారిస్ ఫర్ ద పీపుల్ అనే నినాదంతో తన ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మధ్య తరగతి ప్రజలు చెల్లించే పన్ను, ఇమ్మిగ్రేషన్ పాలసీ, హెల్త్‌కేర్ సిస్టమ్, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె తన ప్రచారంలో ప్రస్తావించారు. అయితే హెల్త్‌కేర్ వంటి పథకాలను ఎలా ముందుకు తీసుకువెళ్తామన్న విషయాలపై స్పష్టత నివ్వక పోవడంతో కమల ప్రచార పర్వంలో వెనుక బడ్డారు.
ఈ క్రమంలో పార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే ఆమె 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోయారు. దీంతో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ఆమె వైదొలిగారు. ఇక ఈ విషయంపై స్పందించిన కమల సహ సభ్యులు, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నల్లజాతి అభ్యర్థి కోరీ బూకర్ మాత్రం తన ప్రచారం హద్దులన్నింటినీ చెరిపి వేసింది. ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. లవ్ యూ సిస్టర్ అంటూ ట్వీట్ చేశారు. మరో వైపు కమల నిర్ణయంపై ఆమె మద్దతుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో కమలా దేవి హ్యారిస్ జన్మించారు. ఆమె తల్లి తమిళనాడులోని చెన్నైకి చెందిన వారు కాగా..తండ్రి ఆఫ్రికన్. ఈ క్రమంలో ఆఫ్రికా, ఆసియా సంస్కృతుల మిశ్రమ సంస్కృతి కారణంగా ఆమెను రాజకీయంగా బరాక్ ఒబామా తోనూ పోల్చే వారు.
1986లో హోవార్డ్ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తి చేశాక, హేస్టింగ్ కాలేజీ ఆఫ్ లా నుంచి కమల న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2003లో శాన్‌ఫ్రాన్సిస్‌కో డిస్ట్రిక్ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. 2011-17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2014లో డగ్లస్ ఎమ్‌హోఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విధానాల పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రచార కార్యక్రమాల్లో ఆయన శైలిని ఎండ గట్టారు. అయితే అనూహ్యంగా అధ్యక్ష రేసు నుంచి తప్పుకొన్నారు. మొత్తం మీద ఒక ధిక్కార స్వరం ఆగి పోవడం బాధాకరం కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి