ఔరా.. సైరా..!

డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ వసూళ్లను రాబడుతోంది. అయిదు భాషల్లో ఈ మూవీని విడుదల చేశారు.  అమితాబ్ ప్రధాన పాత్రలో నటించగా మెగాస్టార్ చిరంజీవి నభూతో న భవిష్యత్ అన్న రీతిలో నటించారు. నయనతార, తమన్నా పోటీ పడగా తమిళ నటుడు విజయ సేతుపతి తన మార్క్ తో సినిమాకు ప్రాణం పోశారు. బుర్రా సాయి మాధవ్ మరోసారి తన మాటల తూటాలు పేల్చారు. మొత్తం మీద సురేందర్ రెడ్డి ఎక్కువ టైమ్ తీసుకున్నప్పటికీ అంతిమంగా మంచి రిజల్ట్ వచ్చింది. ఎక్కడ చూసినా సక్సెస్ అన్న టాక్ వినపడుతోంది. మొత్తం మీద సినిమాపై పెట్టిన ఖర్చు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల అంచనా. ఇక ఓవర్సీస్ పరంగా చూస్తే అమెరికాలో సాహో రికార్డులను సైరా కొల్లగొట్టింది.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను   సురేంద‌ర్ రెడ్డి రూపొందించారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార, తమన్నా లు బాగా నటించారని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.  గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌‌ను సొంతం చేసుకుని‌ మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. దేశ వ్యాప్తంగా మొదటి రోజు 50 కోట్ల కలెక్షన్లను సాధించినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. విదేశాల్లోనూ సైరా చిత్రం రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్‌లో మొదటిరోజు ఈ చిత్రం 10 కోట్ల మార్క్‌ను సాధించినట్టు వార్తలొస్తున్నాయి. అమెరికాలో 308 లొకేష‌న్స్‌లో ప్రీమియ‌ర్స్‌ రూపంలో సైరా 6.10 కోట్ల రూపాయ‌లను రాబ‌ట్టింది. ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి ప్రీమియర్ల ద్వారా  5 కోట్ల 83 లక్షలు కలెక్షన్లు రాగా.. సైరా చిత్రం ఆ రికార్డును అధిగమించింది. ఆస్ట్రేలియాలోనూ సైరా చిత్రం 39 లొకేష‌న్స్‌లో  రూ. 90.29 లక్షలను సాధించింది.

ఇదిలా ఉండగా.. చిరంజీవి 150వ చిత్రమైన ఖైదీ నెం.150 రికార్డును మాత్రం సైరా దాటలేక పోయింది. ఖైదీ నెం. 150 చిత్రం అమెరికాలో ప్రీమియర్ల ద్వారా రూ. 8 కోట్ల ద53 లక్షలను రాబట్టి ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాలలో బాహుబలి ది కన్‌క్లూజన్ 3.5 మిలియన్ డాలర్లు, అజ్ఞాతవాసి1.51 మిలియన్ డాలర్లు,  బాహుబలి: ది బిగినింగ్ 1.39 మిలియన్ డాలర్లు చిత్రాలు ఉన్నాయి. లాంగ్‌రన్‌లో మాత్రం సైరా రికార్డులను క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. యూఎస్‌లో సైరా మిలియన్ క్లబ్‌లో చేరనుంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం మూడు మిలియన్ల మార్క్‌ను సునాయాసంగా దాటేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

కామెంట్‌లు