లేచి పడిన పృథ్వీరాజ్
నటుడిగా తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న పృథ్వీరాజ్ ఇపుడు పునరాలోచనలో పడ్డారు. బాగున్నప్పుడు అంతా పోగైన జనం ఇపుడు పలు ఆరోపణలు ఎదుర్కొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పదవి నుంచి అనూహ్యంగా తప్పుకోవడంతో ఎవరూ ఆయన దరిదాపుల్లోకి వెళ్లడం లేదు. ఈ విషయాన్ని, ఘోరమైన అవమానకరంగా భావిస్తున్నట్లు స్వయంగా ఈ నటుడే ఇటీవల వాపోవడం జరిగింది. పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించిన ఘనత పృథ్విది. అంతే కాకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం కలిగి ఉండడం కూడా ఆయన కెరీర్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. పృథ్వీరాజ్ కు వైఎస్ ఆర్ అంటే పిచ్చి. అదే వైఎస్ జగన్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్‌గా ఉంటూ వచ్చారు. అంతేకాకుండా జగన్ స్థాపించిన కొత్త పార్టీలో ఆయన వెంట కార్యకర్తగా పనిచేశారు. నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు. ఏకంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు.
పార్టీ ప్రచారానికి రథసారథిగా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఓ వైపు వృత్తి పరంగా కళాకారుడైన పృథ్వీరాజ్ తానేమిటో, తన పవర్ ఏమిటో రుచి చూపించారు. దీంతో ఆయన పనితీరును గమనించిన జగన్ మోహన్ రెడ్డి పార్టీ ప్రచారం మొత్తం ఆయనకే అప్పగించారు. జగన్‌కు కుడి భుజంగా ఉన్నారు. ఏపీ రాష్ట్రమంతటా జగన్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్నారు. వేల కిలోమీటర్లను నడిచారు. ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లడంలో ప్రత్యర్థులకు అంతుచిక్కని రీతిలో ప్రచారాన్ని నిర్వహించడంలో పృథ్వీరాజ్ సక్సెస్ అయ్యారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీకి బూస్ట్ లభించింది. భిన్నమైన రీతిలో క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఓ చరిత్ర సృష్టించారు. మోస్ట్ పవర్ ఫుల్ సీఎంగా వినుతికెక్కిన నారా చంద్రబాబు నాయుడి పార్టీకి చుక్కలు చూపించేలా చేశారు పృథ్వీరాజ్. డిఫరెంట్ మేనరిజంతో ..జనాన్ని ఆకట్టుకునే రీతిలో ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ఇచ్చిన స్లోగన్ బుల్లెట్లలా దూసుకెళ్లింది.
అదే లక్షలాది మందిని వైసీపీ అధికారంలోకి వచ్చేలా చేసింది. ఎక్కడ చూసినా వైసీపీ అభ్యర్థులు గెలుపొందడం, వైఎస్సార్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇదే సమయంలో తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన వెంట వుంటూ పార్టీ పురోభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానాన్ని కట్టబెట్టారు జగన్ మోహన్ రెడ్డి. ఇదే సమయంలో ప్రచార బాధ్యతలు చేపట్టిన పృథ్వీరాజ్ అలియాస్ బబ్లూ రెడ్డికి అత్యున్నతమైన తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి న్యూస్ ఛానల్ కు ఏకంగా ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. సంప్రదాయ పద్ధతిలో కొనసాగుతున్న ఈ ఛానల్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే ఇదే సమయంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు పృథ్వీరాజ్.
కొంచెం నోటి దురుసు కూడా ఆయనకు మైనస్ గా మారింది. ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణకు ఆదేశించడంతో ఉన్న పదవిని పోగొట్టుకున్నారు. అత్యున్నతమైన పదవిని అనూహ్యంగా వదులుకున్నారు. ఈ సమయంలో తనపై ఎవరో కుట్రలు పన్నారని, ఏదో ఒకరోజు మళ్లీ అదే పదవి తనకు వరిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు పృథ్వీరాజ్. ఆయనలో ప్రస్తుతం పశ్చాతాపం కనిపిస్తోంది. స్వామి సాక్షిగా తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. కష్ట సమయంలో ఒకే ఒక్క నటుడు చిరంజీవి మాత్రం తనకు సపోర్ట్ గా నిలిచాడని చెప్పారు పృథ్వీరాజ్. ఏది ఏమైనా ఒక నటుడు ఇలా కావడం బాధాకరం కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి