ఈ ఐఐటీలు భారీ ప్యాకేజీలకు ద్వారాలు - చదువా మజాకా
జీవితంలో స్థిర పడటానికి కావాల్సిన టైం వచ్చేసింది. తెలంగాణ విద్యా శాఖ పుణ్యమా అంటూ ఇంటర్మీడియట్ విద్య ఈసారి గాడి తప్పింది. దేశంలోనే ఐటీలో టాప్ ఫైవ్‌లో ఒకటిగా ఉన్న టీఎస్ సర్కార్ ఈసారి పరీక్షల నిర్వహణలో ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఫలితాల వెల్లడిలో జాప్యం, అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు మార్కులు సరిగా రాక ఏం చేయాలో తోచక తల్లడిల్లి పోతున్నారు. ఇండియాలో ఇంజనీరింగ్ కోర్సు చదివితేనే గొప్ప ఉద్యోగాలు వస్తాయని, విదేశాలకు వెళ్లి పోవచ్చని స్టూడెంట్స్ కలలు కంటున్నారు. కానీ వీటికంటే భిన్నమైన కోర్సులను అత్యున్నతమైన విద్యాలయాలుగా, సంస్థలుగా ప్రపంచం మెచ్చిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్నాయి. పేరెంట్స్‌కు..ఇటు విద్యార్థులకు ఏ కోర్సులు ఎంచుకోవాలో తెలియక తిప్పలు పడుతున్నారు.
కూల్ గా ఆలోచించి ..అన్ని వివరాలు నమోదు చేసుకుంటే ..బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ చదివినా ఓకే అంటున్నాయి. లేదా ఫారిన్ కంట్రీస్ కు వెళతామంటే విద్యా నిధి ద్వారా డబ్బులు ఇస్తామంటున్నాయి. కావాల్సందిల్లా అడ్వాన్స్ పరీక్షపై దృష్టి పెట్టడమే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులు జేఇఇ మెయిన్స్ కు హాజరయ్యారు. ర్యాంకులు కూడా ప్రకటించింది. ఇపుడు అసలైన పరీక్ష మొదలైంది. మెయిన్స్ ఆధారంగా ఎన్ఐటీ కాలేజీలుంటే..అడ్వాన్స్ ర్యాంకు ఆధారంగా ఐఐటీ కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది ఏయే ర్యాంకులకు ఏయే కోర్సులు వస్తాయో..ఏయే కాలేజీల్లో చదువుకోవచ్చో గూగుల్‌తో పాటు పలు విద్యా సంస్థలు లెక్కలేసి మరీ చెబుతున్నాయి. పొద్దస్తమానం పుస్తకాలతో కుస్తీలు పడుతున్న విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా టాప్ ఐఐటీలు ఏవో తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి.
ఆ కష్టం లేకుండానే ఇదిగో ఇవే ..అత్యంత నాణ్యమైన, నైపుణ్యంతో కూడిన కాలేజీలు ఇలా ఉన్నాయి. మొదటి ర్యాంకును మదరాసు సాధిస్తే, ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది.
ఇక మూడో స్థానంలో ముంబయి నిలవగా, నాలుగో స్థానంలో ఖరగ్ పూర్ చేజిక్కించుకుంది. ఐదో స్థానంలో కాన్పూర్, ఆరో స్థానంలో రూర్కెలా, ఆరవ స్థానంలో గౌహతి, ఎనిమిదో స్థానంలో హైదరాబాద్, వారణాసి 11వ స్థానంలో, ఇండోర్ 15వ స్థానంలో, ధన్ బాద్ 15వ స్థానంలో , భువనేశ్వర్ 17వ స్థానంలో , మండి 20వ స్థానంలో పట్వా 22వ స్థానంలో , గాంధీనగర్ 24వ స్థానంలో , జోధ్ పూర్ 50వ స్థానంలో నిలిచాయి. 1951లో దేశంలోనే మొదటి ఐఐటీ కాలేజీని ఖరగ్‌పూర్‌లో స్థాపించారు. 1958లో బాంబే ఐఐటీని నెలకొల్పారు. 1958లో మద్రాస్ ఐఐటీని స్థాపించారు. ఇండియాలో అత్యున్నతమైన ఐఐటీగా దీనికి పేరుంది. తమసోమా జ్యోతిర్గమయ పేరుతో 1959లో కాన్పూర్ లో , యుకె సహాయంతో ఢిల్లీలో 1961లో కాలేజీని ప్రారంభించారు.
1999లో గౌహతిలో , 1947లో రూర్కెలాలో స్టార్ట్ చేశారు. 2008లో గాంధీనగర్‌లో ఐఐటీని స్థాపించారు. ఒడిసా కేపిటల్ సిటీ భువనేశ్వర్‌లో 2008లో ప్రారంభించాఉ. ఇదే సంవత్సరం హైదరాబాద్ శివారులో ఐఐటీని నెలకొల్పారు. బీహార్ రాజధాని పాట్నాలో 2008లో నెలకొల్పారు. ఇదే సంవత్సరంలో పంజాబ్‌లోని రోవర్‌లో ప్రారంభించగా.. 2010లో పాలక్కన్‌లో, 2016లో గోవాలో, భిలాయ్‌లో ఐఐటీ కాలేజీలో ఏర్పాటు చేశారు. ధార్వాడ్‌లో, జమ్మూలో, 2014లొ తిరుపతిలో, 2008లో జోధ్‌పూర్‌లో, ఇండోర్, వారణాసి, ధన్‌బాధ్, మండిలో ఐఐటీ సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయి. సో..ఈ కాలేజీల్లో చేరేందుకు ..చదివేందుకు ట్రై చేయండి. మూడేళ్లు ఒత్తిళ్లను జయించండి. జీవితాన్ని సుఖమయం చేసుకోండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి