స్మరించు కోవడం మానవ ధర్మం
మరాఠాలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అనూహ్య పరిణామాల నేపథ్యంలో సంకీర్ణ సర్కారు కొలువు తీరింది. కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి శివ సేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే చుక్కలు చూపించారు. అంతే కాదు మహారాష్ట్రలో కమలాన్ని నామ రూపాలు లేకుండా చేస్తానని ఉద్దవ్ తో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే శపథం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో శివ సేనకు పవర్ దక్కనీయకుండా చేసేందుకు ట్రబుల్ షూటర్లు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా నానా ప్రయత్నాలు చేశారు. తమ చెప్పు చేతుల్లో ఉన్న గవర్నర్ ను పావులాగా వాడుకున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అధికారం దక్కనీయ కూడదనే లక్ష్యంతో ఉద్దవ్ ఠాక్రే ..చిరకాల స్నేహాన్ని వదులుకున్నారు.
అంతే కాదు కొన్ని తరాలుగా శత్రుత్వం కలిగిన వైరి వర్గాలతో చెలిమి చేశారు. రెండున్నర ఏళ్ళ కోసం కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో జత కట్టారు. మొదటి సారిగా శివ సేన పార్టీ మరాఠాలో అధికారం అందుకునేలా చేశారు. ఇది మహారాష్ట్ర చరిత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇదిలా ఉండగా వేలాది మంది సాక్షిగా ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా తన తల్లిదండ్రులను, ఛత్రపతి శివాజీని ఆయన ముందుగా స్మరించు కున్నారు. వారిని గుర్తు చేసుకున్నారు. దీనిపై బీజేపీ మాజీ సీఎం ఫడ్నవిస్ తప్పు పట్టారు. దీంతో ఉద్దవ్ థాక్రే చాలా ఘాటుగానే సమాధానం చెప్పారు.
నా తల్లిదండ్రుల పేర్లు, మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీ పేరును ప్రమాణ స్వీకారం సమయంలో ప్రస్తావనకు తేవడం మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. కానీ.. నేను వారి పేర్లను సందర్భం వచ్చిన ప్రతిసారీ నేను ప్రస్తావిస్తాను. కన్న తల్లిదండ్రుల పేర్లు చెప్పు కోలేని వారు జీవించడానికి కూడా అనర్హులన్నారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడం మహారాష్ట్రలో నేరంగా ఉన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాగా..ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రమాణ స్వీకారం నిర్దేశిత ఫార్మాట్‌లో లేదని, తండ్రి బాలాసాహెబ్ పేరును ప్రమాణ స్వీకారం సమయంలో ప్రస్తావించడం సరికాదని ఫడ్నవీస్ విమర్శించిన సంగతి తెలిసిందే.
అంతకు ముందు అసెంబ్లీలో సంభవించిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన కాళిదాస్ కొలాంబ్కర్ స్థానంలో ఎన్సీపీ నేత దిలీప్ వల్సే పాటిల్‌ను నియమించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం తెలిపారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. మొత్తం మీద శివ సేన ..బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాబోయే కాలంలో ఉద్దవ్ ఠాక్రే ఎలా పాలన సాగిస్తారోనని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి