బీసీసీఐకి కోలుకోలేని షాక్ - ఇక ఎక్కడైనా టెస్టింగే
ప్రపంచంలోనే భారీ ఆదాయం కలిగిన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ బీసీసీఐకి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది నాడా. మేం పూర్తిగా ఇండిపెండెంట్. మాపై ఇంకొకరి పెత్తనం ఏమిటి..? మా నిర్ణయాలు మేమే తీసుకుంటాం. మమ్మల్ని నియంత్రించే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అంటూ బీరాలు పలికిన బీసీసీఐ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. కేంద్ర ప్రభుత్వంలోని క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఆటుగాళ్లను పరీక్షించేందుకు వీలుగా సంతకం చేయడంపై సీనియర్ల నుంఢి పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాజకీయ జోక్యం ఎక్కువై పోయిందని, మంచి పరిణతి కలిగిన ఆటగాళ్లు ఎంపిక కావడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి.
ఈ మేరకు క్రికెటర్లను పరీక్షించే భాద్యత ఇకపై నాడాదే నంటూ బీసీసీఐ సీయివో జోహ్రి సంతకం చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే అంశంపై తాము ఒక్క పైసా ప్రభుత్వం నుండి కానీ , క్రీడా సంస్థ నుంచి కానీ తీసుకోవడం లేదని , తామెందుకు మీ పరిధిలోకి రావాలంటూ గత కొన్నేళ్లుగా యుద్ధం నడుస్తోంది. బీసీసీఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంటూ వచ్చింది. మోదీ కేంద్రంలో కొలువు తీరాకా సీన్ మారింది . ప్రతి వ్యవస్థ పై పట్టు కలిగేందుకు ప్రయత్నం చేశారు . వినక పోతే తీవ్ర వత్తిళ్లు తెచ్చారు. ముఖ్యానంగా బీసీసీఐ కి భారీ ఎత్తున కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది .
ఇదే సమయంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కిందకు మేమెందుకు రావాలి?. నాడాపై మాకు నమ్మకం లేదు. మా క్రికెటర్లను మేమే పరీక్షించుకుంటాం అని బీరాలు పలికింది. ఏమైందో ఏమో కానీ.. ఉన్నట్టుండి నాడాకు బోర్డు జై కొట్టింది. ఇకపై దేశ క్రికెటర్లందరినీ ఎప్పుడైనా, ఎక్కడైనా నాడా పరీక్షించ నుందని కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి చేసిన ప్రకటన.. బీసీసీఐని కుదిపేసింది. బీసీసీఐ సీఓఏ, సీఈఓ అసమర్థత.. యువ క్రికెటర్ పృథ్వీ షా డోపింగ్ కేసు విచారణపై వివాదం వల్లే ‘నాడా’తో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడిందని బోర్డు అధికారులు కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద నిన్నటి దాకా రారాజుగా వెలుగొందిన బీసీసీఐ ఇప్పుడు చట్టం ముందు తలవంచక తప్పలేదు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి