కేజ్రీవాల్ నిర్ణయం..మహిళలకు వరం..ఢిల్లీలో ఉచిత ప్రయాణం..!

అవనిలోనే కాదు సమాజంలో సగ భాగమైన మహిళలకు మేలు చేకూర్చేలా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ దేశంలో ఎక్కడా లేవిధంగా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించారు. మెరుగైన విద్య కోసం నిధులు ఖర్చు చేశారు. అంతే కాకుండా విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. మహిళా సాధికారత పేరుతో ఒకే ఒక్క రోజును నిర్వహించి చేతులు దులుపుకోవడం కాదు, కావాల్సింది వారు తమ కాళ్లపై తాము నిలబడాలి.

అంతే కాదు మహిళలు, యువతులు ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లగలిగేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని గతంలోనే పలుసార్లు ప్రకటించారు. అయితే బీజేపీ మాత్రం ఇదంతా ఆప్ ఆడుతున్న నాటకం అని కొట్టి పారేస్తోంది. తాజాగా కేవలం మహిళల కోసం ఉచితంగా బస్సులో ఎక్కడికైనా ప్రయాణించే సౌలభ్యం ఏర్పాటు చేసింది సర్కార్. దీంతో మహిళలు కేజ్రీవాల్ కు జేజేలు పలుకుతున్నారు. భాయ్ దూజ్ పండగను పురస్కరించుకొని అక్టోబర్ 29 నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది. ఈ మేరకు సమావేశమైన ఆప్ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మహిళలకు సురక్షిత ప్రయాణ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని ఢిల్లీ రవాణా శాఖా మంత్రి కైలాష్ గెహ్లాట్ ప్రకటించారు.

ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సులతో పాటు క్లస్టర్ బస్సులలో కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చని తెలిపారు. మహిళలు, యువతులు టికెట్ తీసు కోవాలను కోవడం, ఉచితంగా ప్రయాణించాలని అనుకోవడం వారి ఇష్టానికే వదిలేశామన్నారు. ట్రావెల్ చేయాలని అనుకున్నవారు కండక్టర్ వద్ద సింగిల్ జర్నీ పాసు ఉంటుందని, దానిని తీసుకోవాలని సూచించారు. ఈ మహిళల ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వంపై అదనంగా 290 కోట్ల రూపాయలు అవసరం పడుతాయని మంత్రి వెల్లడించారు. మొత్తం మీద ఈ ఉచిత ట్రావెల్ తో ఉమెన్స్ చెప్పలేని ఆనందానికి లోనవుతున్నారు. ఇదే ఉచిత ప్రయాణాన్ని దేశమంతటా అమలు చేస్తే బావుంటుంది కదూ.

కామెంట్‌లు