కార్గోపై కన్నేసిన ఆర్టీసీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలను వెతుకుతోంది. ఇప్పటికే ప్రయాణీకులపై మోయలేని భారాన్ని మోపింది. తాజాగా సరుకు రవాణా చేసే పనిలో పెద్దది. పెద్ద మొత్తంలో సరుకు రవాణా కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం 1,209 మంది ఉద్యోగులు, సిబ్బందిని నియమించాలని ప్రతిపాదిస్తూ ఆర్టీసీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఎండీ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయం ఆలశ్యంగా వెలుగు చూసింది. కార్గో సేవలను మెరుగు పరిచేందుకు ఆసక్తి ఉన్న కండక్టర్లు, డ్రైవర్లను గుర్తించేలా రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్లు.. డిపో మేనేజర్లకు సూచించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలో లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేసి ఫాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా పంపాలని సూచించారు. గుర్తించిన కండక్టర్లు కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంటర్వ్యూకు రావాలని కోరారు.

ఈ వింగ్​లో నలుగురు సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటారు. హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక్కొక్కరు చొప్పున ఉండనున్నారు. 11 రీజియన్లలో 11 మంది జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 123 మంది మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆపరేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 822 ట్రక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 1,069 మంది డ్రైవర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం కోరుతున్నారు. కండక్టర్లను రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపిక చేయనున్నారు. వీరికి కార్గో బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టీసీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ ఎండీ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ విడుదల చేసిన ఉత్తర్వుల్లో బల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్గో రవాణా గురించి మాత్రమే ప్రస్తావించారు. పార్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసు గురించి ఎక్కడా పేర్కొనలేదు. దీంతో అసలు పార్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కార్గోపై ఎలాంటి సర్వే చేయకుండా హడావుడిగా ఏర్పాటు చేయడంపై ఆర్టీసీ యూనియన్లు పెదవి విరుస్తున్నాయి. ఏపీలో నడుస్తున్న పార్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసులు లాభాలు తెచ్చి పెడుతున్నాయి. ఏటా సుమారు వంద కోట్ల దాకా ఆదాయం వస్తోంది. ఏపీలో జిల్లాకో ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రమే నియమించారు. మిగతాది ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నడిపిస్తున్నారు. ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో బస్సులను కూడా ఉపయోగిచడం లేదు. బస్సుల్లోనే వెనుక భాగంలో ప్రత్యేకంగా స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంచడం, హైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సుల్లో సైడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న ఖాళీల్లోనే సరుకు రవాణా చేస్తున్నారు. ఆర్టీసీలో ఇంత పెద్ద మొత్తంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనుండటంతో లాభాలు వస్తాయా రావా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. 

కామెంట్‌లు